రోజురోజుకు రీఛార్జ్ రెట్లు పెరుగుతున్నాయి.. అన్ లిమిటెడ్ కాల్స్, డేటా యూజర్స్ పెరిగినందున కంపెనీలు విపరీతంగా రీఛార్జ్ రెట్లు పెంచాయి..భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL కస్టమర్లకు శుభవార్త..! రూ.365 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది..! లోటుపాట్లు ఇలా ఉన్నాయి..
ఎప్పటికప్పుడు, కొత్త ప్లాన్స్ తో తన యూజర్లకు సరైన ప్లాన్స్ అందించడంలో మరింత యాక్టివ్ గా వున్న టెలికం సంస్థల్లో BSNL ఒక ప్రధాన సంస్థగా కొనసాగుతోంది. ఇప్పుడు తన వినియోగదారులకు అధిక లాభాలను అందించడానికి రూ .365 ప్రీపెయిడ్ ప్లాన్ విడుదల చేసింది. ఈ ప్లాన్ కాలపరిమితి 365 రోజులు. రోజుకు 250 చొప్పున అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2GB రోజువారీ డేటాక్యాప్ ఉంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితం. అయితే ఇది కేవలం 60 రోజులు మాత్రమే వర్తస్తుంది. ఈ ఉచిత పరిమితి ముగిసిన తర్వాత వాయిస్, డేటా వోచర్స్ అవసరం. ఈ క్రొత్త ప్లాన్ రీఛార్జ్ చేయడానికి వినియోగదారులు BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్, రిటైలర్ను, ఆన్లైన్లో లేదా MyBSNL యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఏడాది కాలపరిమితితో కూడిన రూ.365 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులను ఆకర్షించేలా ఉంటుంది. కానీ 60 రోజుల నిబంధన ఆకర్షణీయం కాదు..ఈ ప్లాన్ కింద 2 నెలల పాటు ఉచితంగా రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్‌తో పాటు 2GB డాటా, 100 ఎస్సెమ్మెస్‌లు ఉన్నాయి. రోజులో 2GB డాటా పూర్తయ్యాక ఇంటర్నెట్ వేగం 80Kbpsకు తగ్గిపోతుంది. ఇవి కేవలం తొలి 2 నెలల మాత్రమే ఉంటాయి. మిగతా 10 నెలల పాటు ఎలాంటి ఆఫర్లు ఉండవు. ఈ ప్లాన్‌తో ఎలాంటి డేటా లేదు. కాల్ చేసేందుకు మాత్రమే సెకండ్ ఫోన్ వినియోగించే వారికి మాత్రమే ఇది ఉపయోగం.