NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేంద్రానికి అసలు రైతులతో చర్చించడమే ఇష్టం లేదా..? ఏమిటీ ప్లాన్?

నూతన వ్యవసాయ చట్టాల విషయంలో దేశవ్యాప్తంగా రైతులు ఏ స్థాయిలో ఆందోళనలు చేపట్టారో అందరికీ తెలిసిందే. వారు ప్రతిఘటించడం మొదలు పెట్టిన మొదట్లో ఉన్నంత తీవ్రత ఇప్పుడు లేదేమో అన్న భావన ప్రజల్లో కలుగుతుంది. అయితే 11వ సారి కేంద్రంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం వైఖరి పట్ల కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి…

 

రైతులకి మళ్ళీ రిక్తహస్తాలే….

వివరాల్లోకి వెళితే…. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులను మరింత చిక్కుల్లో పడటం ఖాయమని…. కార్పొరేట్ వ్యవసాయం పెరిగితే మరింత ఒత్తిడి పెరిగి రైతన్నలు పూర్తిగా కార్పొరేట్ శక్తుల హస్తం పోతారు అని తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్-ఢిల్లీ సరిహద్దు రైతులు నెలలతరబడి ఆందోళన చేస్తున్నారు. ఇదే సమయంలో పంటలకు మద్దతు ధర విషయంలో కూడా వీరందరికీ తీవ్ర అన్యాయం జరుగుతోందని వీరంతా నిర్వహిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈరోజు 11వ సారి రైతులతో చర్చ నిర్వహించింది అవి కాస్త అందరూ అనుకున్నట్లే మరొకసారి విఫలం అయ్యాయి.

 

రైతులకి భారీ మద్దతు..!

ఇక దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా రైతులకు మద్దతు పెరుగుతోంది. పలు దేశాల్లో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా చూశాం. అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల విషయాన్ని పెద్దగా సమస్య గా పరిగణించడం లేదన్న వార్తలు ఊపందుకున్నాయి. న్యూస్ చానల్స్ కూడా మొదట్లో చేసిన హడావిడి ఇప్పుడు చేయట్లేదని అసలు వారి బాధ ప్రభుత్వం వరకు పక్కన పెడితే కనీసం ప్రజల వరకు కూడా వెళ్లడం లేదని అంటున్నారు. 10 మార్లు కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ నూతన చట్టాలపై రైతులతో చర్చలు జరిపి ఒక్కసారి కూడా సానుకూల పరిష్కారంతో ముందుకు రాకపోవడం ఏమిటని పలువురు వర్గాల రాజకీయ పండితులు దుమ్మెత్తిపోస్తున్నారు.

సహనానికి పరీక్షా…?

ఇరుపక్షాలు ఎవరి వాదన వారిదే అన్నట్టు ఉన్నారు కాబట్టి ఒకరిని తప్పుపట్టడం సరికాదు అయితే అసలు కేంద్రానికి చర్చలు నిర్వహించడం ఇష్టం లేదని ఏదో నామమాత్రంగా 10 నిమిషాలు మాత్రమే చర్చలు జరిపి మమ అనిపించారు అని రైతు సంఘాల ప్రతినిధులు చెప్పడం గమనార్హం. దీంతో ఈ మహా వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నట్లు…. ఇల్లు వాకిలి వదిలేసి తిండి తిప్పలు లేకుండా రోడ్డుపై ఎన్నాళ్లు ఉంటారో చూద్దామని వేచి చూస్తున్నారు అంటూ మరికొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇక సుప్రీంకోర్టు వేసిన త్రిసభ్య కమిటీ నుండి వచ్చే పరిష్కారం పైన ఆశలు ఉన్నప్పటికీ ఇక దీనికి కేంద్ర ప్రభుత్వం కానీ రైతు సంఘాలు కానీ ఎంత మాత్రం కట్టుబడి ఉంటారు అన్న విషయం పై ఇంకా అనుమానాలు అలాగే ఉన్నాయి, 11వ సారి జరిగిన చర్చల్లో ఏ రోజూ సహృద్భావ వాతావరణం తో అవి ముగిసిన సందర్భాలు లేకపోవడం నిజంగా విచారకరం.

Related posts

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !