NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: అమిత్ షా, జేపీ నడ్డాతో అర్ధరాత్రి చంద్రబాబు భేటీ .. సుదీర్ఘ చర్చలు .. ఈ ట్విస్ట్ ఏమిటో..?

BJP Behind Chandrababu arrest and remand,,?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఆర్ధరాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు నలభై నిమిషాలు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. రాత్రి 11.25 గంటలకు చంద్రబాబు అమిత్ షా నివాసానికి చేరుకున్న చంద్రబాబు ఆయనతో రాజకీయ చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వీరిద్దరి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు.

BJP Behind Chandrababu arrest and remand,,?
Chandrababu

ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలో దిగుతున్న నేపథ్యంలో టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడానికి బీజేపీ పెద్దలు చంద్రబాబుతో సమావేశమైనట్లుగా భావిస్తున్నారు. ఎన్డీఏలో చేరడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చంద్రబాబు గతంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చాలా కాలంగా చంద్రబాబు బీజేపీతో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

BJP Behind Chandrababu arrest and remand,,?
Chandrababu

ఈ తరుణంలో అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ కావడంతో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో బీజేపీ – టీడీపీ పొత్తు కుదిరితే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్న సీట్ల గురించి కూడా అమిత్ షా ఆరా తీసినట్లుగా తెలిసింది. అలానే రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై కూడా వీరి మధ్య చర్చలు జరిగినట్లుగా తెలిసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయాలని చంద్రబాబు అమిత్ షా ను కోరినట్లుగా తెలిసింది. 2014 కాంబినేషన్ మళ్లీ 2024 లోనూ ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని చంద్రబాబు వివరించినట్లుగా సమాచారం.

chandrababu met amit shah and jp nadda

ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ విధ్వంసకర పాలన సాగిస్తున్నారని, అనేక వర్గాలు వైసీపీకి దూరమైన విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకువచ్చినట్లుగా తెలుస్తొంది. ఏపీలో అధికారంలోకి వస్తే ప్రభుత్వంలోనూ బీజేపీ చేరితే బాగుంటుందని అని కూడా చెప్పినట్లు సమాచారం. అలానే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో తనను ఎలా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేసిన విషయాన్ని కూడా అమిత్ షా కు చంద్రబాబు వివరించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అన్ని పార్టీల నేతలకు ఇది అనుభవమేనని ఆయన చెప్పినట్లు సమాచారం.

అయితే చంద్రబాబు మాట్లాడే సమయంలో అక్కడే ఉన్న జేపీ నడ్డా ఆయన కంటే పది నిమిషాల ముందుగా వెళ్లిపోయారు. కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అమిత్ షా నుండి పిలుపు రావడంతో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దీంతో ఈ రోజు కూడా మరో సారి ఈ ఇద్దరు నేతలు బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినబడుతున్నాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే .. ఇటీవల ఎన్డీఏ కూటమిలోకి వచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా చంద్రబాబు కంటే కాస్త ముందుగా అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.

ఆ తర్వాత చంద్రబాబుతో అమిత్ షా భేటీ అయ్యారు. అయితే నితీష్ కుమార్ తో భేటీ అయిన ఫోటోలను అమిత్ షా, జేపీ నడ్డా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకున్నారు కానీ చంద్రబాబుతో భేటీకి సంబంధించి ఫోటోలను తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేయలేదు. దీంతో ఎన్డీఏలో టీడీపీ చేరిక అంశంపై ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన కుదరలేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో పక్క అమిత్ షా తో చంద్రబాబు భేటీకి సంబంధించి టీడీపీ వ్యతిరేక సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అమిత్ షా కాళ్లు చంద్రబాబు మొక్కినట్లుగా ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనిపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తొంది.

Medaram Maha Jatara: మేడారం మహా జాతర తేదీలు ఇవే .. ఈ సారి జాతరకు భారీగా ఏర్పాట్లు ..జాతర ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారంటే..?

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?