Charmme Kaur: ఎంత రిక్వెస్ట్ చేసినా అందుకు మాత్రం నో అంటోన్న ఛార్మి..!

Share

Charmme Kaur: ఒక దశలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ఓ వెలుగు వెలిగింది ఛార్మి కౌర్. బొద్దుగా ఉండే ఈ బ్యూటీ వరుస సినిమాలతో ఆకట్టుకుంది. పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా ఛార్మి నిలిచింది. కొన్ని పాత్రలను అద్భుతంగా పోషించి ఇండస్ట్రీలోని విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. కొన్ని లక్షల మంది కుర్రాళ్ల గుండెల్లో కలల రాణిగానూ ఛార్మి నిలిచింది. దాదాపు హీరోయిన్‌గా 15 ఏళ్ళకి పైగానే ఇటు సౌత్ అటు నార్త్ సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా కొనసాగింది. ఛార్మి 2001వ సంవత్సరంలో, ‘నీ తోడు కావాలి’ అనే సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమయింది. అప్పుడు ఛార్మి ఏజ్ 14 సంవత్సరాలే. ఏదో పాకెట్ మనీ కోసం అన్నట్టుగా సినిమాలు చేసింది.

Charmme Kaur says no to that eventhough after requesting her...!
Charmme Kaur says no to that eventhough after requesting her…!

ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా బ్రతిమాలి ఒప్పించి మరీ ఇండస్ట్రీలోకి వచ్చింది. బాలీవుడ్ స్టార్స్ నటించిన ఓ సినిమాలో డాన్స్ గర్ల్స్ బృందంలో ఒకరిగా ఛార్మీ ఇండస్ట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దీపక్ హీరోగా పరిచయమైన నీతోడు కావాలితో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీకొచ్చిన అతి కొద్దికాలంలోనే అగ్ర దర్శకుడు, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీతో పనిచేసే అవకాశాలను అందుకుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో నితిన్ – సీనియర్ నటుడు అర్జున్ కీలక పాత్రల్లో నటించిన శ్రీఅంజనేయం సినిమాతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది ఛార్మి.

Charmme Kaur: ఈ సినిమా నుంచి పూరి – ఛార్మిల మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.

వాస్తవంగా ఈ సినిమా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది. అయినా ఆమెకి మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా చాలా మంచి పేరు తెచ్చింది శ్రీఅంజనేయం. ఇక ఈ సినిమా తర్వాత కూడా వరుసగా కృష్ణవంశీ దర్శకత్వంలోనే ప్రభాస్ హీరోగా వచ్చిన చక్రం, రాఖీ, ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన పౌర్ణమి, లారెన్స్ రాఘవ దర్శకత్వంలో నాగార్జున నటించిన మాస్, రవితేజ చంటీ లాంటి పక్కా కమర్షియల్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

అంతేకాదు ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరొకవైపు మంత్ర, అనుకోకుండా ఒకరోజు, మంత్ర 2, జ్యోతి లక్ష్మీ వంటి లేడీచిత్రాలలో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన జ్యోతిలక్ష్మీ సినిమాలో నటించడమే కాకుండా నిర్మాతగాను మారింది. ఈ సినిమా నుంచి పూరి – ఛార్మిల మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆయన దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ హీరోగా హిందీలో తెరకెక్కిన బుడ్డా అనే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Charmme Kaur: వారి కోసమైనా ఓ సారి వెండితెర మీద మెరుస్తుందో లేదో.

అయితే ఛార్మీ హీరోయిన్‌గా సినిమాలు మానేసి నిర్మాతగానే కొనసాగుతోంది. పూరి కనెక్ట్స్ అనే బ్యానర్‌లో పూరితో కలిసి సినిమా నిర్మాణంలో ఉంది. కానీ ఆమె సోషల్ మీడియాలో అభిమానులకి షేర్ చేసే ఫొటోస్ చూసి తన అభిమానులు మా కోసం ఒక్కసారి మళ్ళీ హీరోయిన్‌గా సినిమా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఆమె మాత్రం చిన్న స్మైల్‌తో నో అంటోంది. చెప్పాలంటే దాదాపు మూడేళ్ళ నుంచి అభిమానులు, ఛార్మిని సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని ఆశపడుతున్నారు. కానీ ఆమె మాత్రం అందుకు నో అంటోంది. కనీసం చిన్న గెస్ట్ రోల్‌లో కనిపించినా హ్యాపీగా ఫీలయ్యే లక్షల అభిమానులున్నారు. మరి వారి కోసమైనా ఓ సారి వెండితెర మీద మెరుస్తుందో లేదో.


Share

Related posts

Reliance Jio: ప్రపంచంలోనే అత్యంత చవకైన “జియో నెక్స్ట్” స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు చూసేయండి..

bharani jella

Allu Arjun : బన్నీ ఫాన్స్ కాలర్ ఎగరేసే వార్త నేషనల్ వైడ్ రికార్డు సృష్టించిన అల్లు అర్జున్..!!

sekhar

టాప్ ట్రెండింగ్ లో తీన్మార్ సావిత్రి బతుకమ్మ పాట

Varun G