ట్రెండింగ్ న్యూస్

Comedy Stars : జబర్దస్త్ ను మించిపోయిన కామెడీ స్టార్స్.. ఎంటర్ టైన్ మెంట్ డోస్ మామూలుగా లేదు?

Comedy Stars జబర్దస్త్ ను మించిపోయిన కామెడీ స్టార్స్ ఎంటర్ టైన్ మెంట్ డోస్ మామూలుగా లేదు
Share

Comedy Stars : కామెడీ స్టార్స్ Comedy Stars ప్రోగ్రామ్ గురించి తెలుసు కదా. స్టార్ మాలో ఇటీవలే ప్రారంభం అయిన ఈషోకు ప్రస్తుతం బాగానే పాపులారిటీ వస్తోంది. ఎందుకంటే.. ఈ షో జబర్దస్త్, బొమ్మ అదిరింది కామెడీ షోలకు పోటీగా వచ్చింది. అయితే.. వాటికి దీటుగానే ఈ షోను రూపొందించారు. ప్రస్తుతం ఈ షో.. జబర్దస్త్ కన్నా కూడా ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది.

comedy stars, jabardasth, కామెడీ స్టార్స్, జబర్దస్త్
comedy stars, jabardasth, కామెడీ స్టార్స్, జబర్దస్త్

దానికి కారణం ఈ షో జడ్జిలే కాదు.. షో యాంకర్ వర్షిణీ, కామెడీ చేసే కంటెస్టెంట్లు. మామూలుగా జబర్దస్త్ లో అయితే.. లేడీ కంటెస్టెంట్ల కోసం మగవాళ్లే ఆడవేషం వేసుకుంటారు. కానీ.. ఇక్కడ మాత్రం అందరూ అందమైన ముద్దుగుమ్మలే. బిగ్ బాస్ కంటెస్టెంట్లు, టీవీ సీరియళ్లలో నటించేవాళ్లు.. వీళ్లందరూ కలిసి చేసే హడావుడి మామూలుగా ఉండదు.

ఇక.. వర్షిణి అయితే.. జబర్దస్త్ లో అనసూయ, రష్మిలను మించిపోయి మరీ.. అందాలను ఆరబోస్తోంది. శేఖర్ మాస్టర్ గురించి తెలిసిందే కదా. కంటెస్టెంట్లతో ఎలా కనెక్ట్ అవుతారో? ఇక మరో జడ్జి హీరోయిన్ శ్రీదేవి కూడా బాగానే నవ్వుతూ జడ్జిమెంట్ బాగా ఇస్తున్నారు.

ఇక.. కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. చమ్మక్ చంద్ర, పటాస్ హరి, యాదమ్మ రాజు.. వీళ్లంతా కలిసి చేసే హంగామా మామూలుగా లేదు. జోర్దార్ సుజాత, అషురెడ్డి, సిరి లాంటి అందమైన అమ్మాయిలు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేసి కామెడీని పండిస్తుండటంతో కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అయిపోతోంది.

Comedy Stars : జబర్దస్త్ ను మించిపోయింది.. కానీ ఇదే ఎనర్జీతో ఉంటే బెటర్

ఈ షోపై నెటిజన్లు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. షో సూపర్ గా ఉంది. జబర్దస్త ను మించిపోయింది కానీ.. అదే ఎనర్జీని మెయిన్ టెన్ చేస్తే.. కామెడీ స్టార్స్ తెలుగులోనే నెంబర్ వన్ షో అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇక.. ఈ ఆదివారం ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ ప్రోమో కూడా తాజాగా వచ్చేసింది. మీరు మాత్రం ఈ ప్రోమో చూసి నవ్వకుండా ఉండలేరు.

 


Share

Related posts

Vidya Sagar: పెట్రోల్ ధర భగ్గుమంటున్న వేళ.. తెలంగాణ వ్యక్తి తెలివైన ఆలోచనకు అందరూ ఫిదా..!!

bharani jella

KL Rahul: కేఎల్ రాహుల్ భారత జట్టులో అసలు అతని స్థానం ఏంటి?

arun kanna

‘తిట్టిపోయడానికి వారికి మైక్’

somaraju sharma