NewsOrbit
న్యూస్

మహానగరం అంధకారానికి కారణాలు…

 

 

దేశ వాణిజ్య రాజధాని, మెట్రోపాలిటన్ సిటీ అయినా ముంబై లో కారు చీకట్లు అలుముకున్నాయి. ఎప్పుడు లేని విధంగా ముంబై మహా నగరంలోని అన్ని ప్రాంతాలు ఒకటిగా కరెంటు కోతకు గురి అయింది.విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఏర్పడడంతో నగరం స్తంభించిపోయింది. ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. విద్యుత్ అధికారుల ప్రమేయం లేకుండానే పవర్ కట్ అయ్యింది. మహా నగరం లో అక్టోబరు 12న గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచి పోయిన విషయం తెలిసిందే. నగరమంతా విద్యుత సరఫరా ఆగిపోవడం వల్ల ప్రజలు బయాందోళనికి గురి అయ్యారు.ఉదయం 10 గంటల తర్వాత క్రమంలో ఒక్కో ప్రాంతంలో ఈ సమస్య తలెత్తింది. శివారు ప్రాంతాల్లో అయితే 10 నుంచి 12 గంటలు కరెంట్‌ లేదు.విద్యుత్‌ సరఫరా నిలిచి పోవడంతో పలు రైల్‌ సర్వీసులు రద్దయ్యాయి,లోకల్ ట్రెయిన్ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆసుపత్రుల కోసం అత్యవసరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. అయితే దీనికి సైబర్ దాడి ఏ కారణం అన్ని సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

mumbai city

ముందుగా విద్యుత్తును సరఫరా చేసే లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు పలుసార్లు ట్రిప్పింగ్ కావడంతో ముంబై, శివారు ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయని, అనుకున్నారు అందరు. గ్రిడ్‌లో సాంకేతిక లోపం వల్లే విద్యుత్ సరఫరా నిలిచినట్టు, టాటా పవర్స్ వైఫల్యంతో నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని బృహణ ముంబయి విద్యుత్, సరఫరా విభాగం అధికారులు అప్పుడు తెలిపారు.

 

power distribution

దీని వెనుక భారీ కుట్ర ఉన్నట్టు సైబర్క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సైబర్‌ దాడి కారణం గానే పవర్‌ కట్‌ జరిగిందని దర్యాప్తులో తేలినట్లు సమాచారం. విద్యుత్‌ సరఫరా నిలిచి పోవడం పై ముంబయి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పవర్‌ సప్లయ్‌, ట్రాన్స్‌ మిషన్‌ కు సంబంధించిన సర్వర్ల లో అనుమానాస్పద లాగిన్‌ లను సైబర్‌ విభాగం అధికారులు గుర్తించినట్లు సంబంధిత వర్గాల సమాచారం.సింగపూర్ సహా దక్షిణాసియాలోని కొన్ని దేశాలకు చెందిన హ్యాకర్లు.. ముంబై పవర్ సప్లై ట్రాన్స్మిషన్ సర్వర్లలో లాగిన్ అయి పవర్ను తీసేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. లోడ్‌ డిస్‌ప్యాచ్‌ సెంటర్‌ ను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు దాడి చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సైబర్ దాసి వల్ల 400 కేవీ లైన్ ట్రిప్ అయినట్లు సమాచారం. ఎంఐడీసీ పాల్గర్ దహనూ లైన్లలో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముంబై నగరానికి వెళ్తున్న 360 మెగా వాట్ల పవర్ సరఫరాకు అంతరాయం కలిగినట్లు సమాచారం.సైబర్ దాడి పైన తమ అనుమానాలు ప్రాథమికంగా నిర్ధారించిందే నని, పూర్తి రిపోర్ట్‌ వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని సైబర్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. సైబర్‌ ముప్పు పై మహారాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి నితిన్‌ రౌత్‌ ను ప్రశ్నించగా.. ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.

 

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju