Fast Food : బయట ఫుడ్ తినేటప్పుడు:
చాలా మందికి బయటి ఆహారం అంటే మహా ఇష్టం.. అంత ఇష్టం మళ్ళి ఇంట్లో తయారు చేసిన వాటి మీద ఉండదు. అయితే బయట ఫుడ్ తినేటప్పుడు అది వండడానికి ఏ రకపు నూనె వాడతారో ఎప్పుడైనా ఆలోచించారా ? వాళ్లు ఏ నూనె వాడుతారో ఆలోచించకుండానే పిల్లలతో సహా కుటుంబ సభ్యులు అందరు బయట తయారు చేసే ఫుడ్ లాగించేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా దానిగురించి తెలుసుకోండి. బయట ఫుడ్ ఎంత ప్రమాదకరమో. చనిపోయిన ఎద్దులు, బర్రెలు, ఆవుల నుంచి కొవ్వు, ఎముకలను సేకరించి.. కొవ్వును పేద్ద మూకుడులో వేసి బాగా వేడి చేస్తారు.
Fast Food : అవి డ్రగ్స్ లాగ పనిచేస్తాయి:
ఎముకలను మాత్రం రెండు మూడు రోజుల పాటు నీళ్లలో నానబెట్టి తర్వాత బయటకు తీసి ఎండబెట్టి వాటిని ముక్కలు, ముక్కలుగా చేసి తర్వాత ఆ కొవ్వు, ఎముకలను ప్రాసెస్ చేసి నూనె తయారు చేసేస్తారు. ఆ నూనెనే మీరు బయట ఎంతోఇష్టం గా తినే ఫుడ్ ను తయారు చేయడం కోసం హోటళ్లలో వాడతారు. మీరు బయట ఎంతో ఇష్టం గా తినే ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, ఇతర వంటకాలు చాలా రుచికరం గా ఉండటానికి కారణం కూడా ఇదే. జంతు కళేబరాలతో చేసే వంటలు మంచి రుచిని కలిగి ఉంటాయట. అంతేకాదు అవి డ్రగ్స్ లాగ పనిచేస్తాయి. కాబట్టే ఒకసారి తింటే మళ్లీ మళ్లీ ఆ రుచి కావాలనిపిస్తుంది . ఆ నూనెలతో చేసిన వంటకాలు తినడం వలన రక రకాల రోగాల పాలై హాస్పిటల్ చుట్టూ తిరగక తప్పదు. అందుకే బయట ఆహారం తినాలంటే బాగా ఆలోచించండి. అయినా పర్వాలేదు మీకు తినేస్తాం అంటే అది మీ ఇష్టం.
ఇది లీటరు నూనె కేవలం 20 నుంచి 30:
అయితే అన్ని హోటళ్లలో ఈ రకపు కల్తీ నూనె వాడుతారని చెప్పలేం.. కాకపొతే దాదాపు బిర్యానీ సెంటర్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్స్, చాట్ బండార్స్, చిన్న చిన్న హోటళ్లలో మాత్రం ఖచ్చితంగా ఈ కల్తీ నూనె తోనే వండుతున్నారట. ఎందుకంటే ఇది లీటరు నూనె కేవలం 20 నుంచి 30 రూపాయలకే కొనుగోలు చేస్తారు కాబట్టి. డబ్బుల కు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో వాళ్లు ఆడుకుంటున్నారు. కాబట్టి తినే ముందు బాగా ఆలోచించండి. పిల్లలకు అసలు పెట్టకండి.