Categories: న్యూస్

guppedentha manasu: వామ్మో రిషి మామూలోడు కాదుగా…వసు మీద ప్రేమతో అందరి ముందు జగతిని ఫూల్ చేసాడు పాపం.!

Share

guppedentha manasu:ఎన్నో ట్విస్ట్ లతో మరెన్నో ఊహించని పరిణామాల మధ్య గుప్పెడంత మనస్సు సీరియల్ ముందుకు సాగుతుంది. వసుని ఇంట్లో నుంచి పంపేయమన్న రిషి మాటలను సీరియస్ గా తీసుకుని జగతి వసునూ మనసును బాధపెడుతోంది. ఎట్టకేలకు వసు లగేజ్ సర్దుకుని వెళ్లిపోతూ మేడం దగ్గర కాసేపు నిల్చుని బయటకు వెళ్లిపోతుంటుంది వసుధార. ఆ సమయంలోనే మహీంద్ర అక్కడకు వచ్చి వసుధారను చూసి షాక్ అవుతాడు. ఏంటిది..ఎక్కడికి వెళుతున్నావ్ అని వసుధారను, ఏంటి ఇది అని జగతిని క్వశ్చన్ చేస్తాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోతోంది మహేంద్ర అని సమాధానం చెబుతుంది జగతి.తనెక్కడికి వెళుతుంది-ఎక్కడ ఉంటుంది అంటే.. తను చిన్న పిల్ల కాదు-ఎక్కడ ఉండాలో ఏం చేయాలో అన్నీ తెలుసని చెబుతుంది జగతి.

Red Meat: మాంసాహారం తింటే క్యాన్సర్ వస్తుందా..!? నిజమేనా..!?

జగతి మీద ఫైర్ అయిన మహేంద్ర :

వసు ఎక్కడికి వెళ్లిపోతున్నావ్ అని అడిగితే నేను ఎవరికీ భారం కాకూడదని వెళుతున్నా అనగానే..భారం ఏంటి చెట్టుకి కాయ భారం అవుతుందా అని మహీంద్రా అంటే.. కొన్నాళ్లకి కాయ కూడా చెట్టునుంచి విడిపోక తప్పదు కదా సార్ అంటుంది వసు. ఎక్కడికి వెళతావ్ అంటే.. ఎక్కడో చోట నాకు ప్లేస్ దొరుకుతుంది.. నా జీవితం లక్ష్యాలను మరిచిపోను, వాటిని సాధించుకుని తీరుతాను. కడుపు నిండితే భోజనం, కన్ను మూస్తే నిద్ర, ఎదురీదితే జీవితం అవుతుందని చెబుతుంది. జగతి నీ ప్రవర్తనలో ఏదో మార్పొచ్చింది, నువ్వు నువ్వులా లేవు, నీలో నువ్వు కాని ఓ కొత్త జగతి కనిపిస్తోందని రెట్టించి అడుగుతాడు.వెళతా అంది ఆపలేదు.ఎవరి జీవితం వాళ్లిష్టం అంటుంది. ఇది నువ్వు కాదు జగతి.నిన్ను ఎవరైనా బెదిరించారా అని అడిగితే..ఎవరో బెదిరిస్తే భయపడతానా అని స్థిరంగా సమాధానం చెబుతుంది. మహేంద్ర నీకో విషయం అర్థం కావడం లేదు, వసుధార జీవితం తనిష్టం, ఎక్కడికైనా వెళుతుంది, ఎక్కడైనా ఉంటుంది, తను ఎక్కడైనా ఉండేహక్కు తనకు ఉంటుంది, తనతో మనకేం సంబంధం మహేంద్ర అంటుంది. 

Karthika deepam: రుద్రాణి చేతిలో కోటేష్, శ్రీవల్లిలతో పాటు దీప -కార్తీక్ కూడా చనిపోతున్నారా..??
ప్లేట్ ఫిరాయించిన రిషి…. షాక్ లో జగతి :

ఈలోపు అక్కడికి రిషి ఎంట్రీ ఇస్తాడు. ఏంటి మేడం మీకెలాంటి సంబంధం లేదా.. అంత ఈజీగా సంబంధం లేదని ఎలా అంటారని మాట్లాడి జగతికి ఊహించని షాక్ ఇస్తాడు. ఏ సంబంధం లేకపోతే ఎక్కడో చదివే వసుధారని డీబీఎస్టీ కాలేజీకి ఎందుకు తీసుకొచ్చారు, ఏం సంబంధం లేకపోతే తనకోసం చాలాసార్లు నాతో ఎందుకు గొడవపడ్డారు, గురు-శిష్యుల సంబంధం కన్నా గొప్పది ఏముంది మేడం అని జగతిని ప్రశ్నిస్తాడు. మీకు తనపై బాధ్యత ఒకటుండాలి కదా, ఓ కాలేజ్ టాపర్ ని చదువు మధ్యలో ఇలా గాలికి వదిలేస్తే తన లైఫ్ ఏమైపోతుందో ఆలోచించారా అని, అయినా మధ్యలో ఇలా వదిలేయడం మీకు అలవాటే కదా అని జగతిని ఉద్దేశించి మాట్లాడతాడు. ఒకవేళ వసుధార వెళ్తాను అన్నా కూడా మీరు ఆపాలి కదా, ఎటుపోతే నాకేంటి అనుకుంటున్నారా అంటాడు. రిషి మాటలు విని షాక్ అవుతుంది..ఏంటి రిషి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటుంది. ఏంటి డాడ్ మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు, తను వెళ్లిపోతానంటే చేతిలో బ్యాగ్ లాక్కుని విసరాలి కదా అనేసి..వసు నువ్వు ఎక్కడికీ వెళ్లడం లేదు ఇక్కడే ఉంటున్నావ్ అంటాడు. రిషి మాట విని జగతి ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఇక లోపలికి వెళ్ళమని వసుకు చెప్పి అక్కడనుండి రిషి వెళ్ళిపోతాడు. వసు చేతిలో బ్యాగ్ తీసుకుని లోపల పెడుతుంది జగతి.

ఆలోచనలో పడ్డ రిషి :

సీన్ కట్ చేస్తే రోడ్డు పక్కన కారు ఆపి తన మాటలు తాను గుర్తుచేసుకుంటాడు రిషి. నేనే వసుధారని హాస్టల్ కి పంపించమన్నాను-మళ్లీ నేనే వద్దన్నాను జగతి మేడం మనసులో ఏమనుకుంటున్నారో అనుకుంటాడు. వసు ఏదైనా తీసుకోకూడని నిర్ణయం తీసుకుని ఉంటే నేనే బాధపడాల్సి వచ్చేది. ఇప్పుడు నిజం చెప్పలేను-అబద్ధం చెప్పలేను. కానీ జగతి-వసు ఇద్దరూ శరీరం-ఆత్మలా కలసిపోయారు.వాళ్లని కలసి చూడలేను, అలాగని వాళ్ళిద్దరిని విడదీసి వసుని బాధించలేను.ఆమె విషయంలో ఇంకేమైనా ఆలోచించాలి అనుకుంటాడు.
ఇక జగతి-మహేంద్ర బయట నిల్చుని ఉండగా వసుధార కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఈలోపు మహేంద్ర జగతి ఇది నీ ఆలోచన కాదు.నీ వెనుక ఎవరున్నారు?. రిషి ఏమైనా చెప్పాడా అసలు రిషి ఈ సమయంలో ఎందుకొచ్చాడు, వసుధారని వెళ్లమని నువ్వు చెప్పవు, వెళ్తా అన్నా వెళ్లనివ్వవు.ఇలా ఎందుకు చేశావ్ అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు మహేంద్ర.. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

4 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

6 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago