NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Telangana: కేసీఆర్ కి మళ్లీ అక్కరకు రానున్న మేనల్లుడు!ఆరోగ్య శాఖ ఆయనకే రిజర్వుడటా!?

Telangana: తెలంగాణలో కొత్త హెల్త్‌ మినిష్టర్‌ ఎవరనే దానిపై క్లారిటీ వస్తోంది. ఎన్నో ప్రచారాలు, మరెన్నో ఊహాగానాలు వచ్చినా జరగాల్సింది జరిగిపోతోంది. వరుస భేటీలు, సమీక్షలు చూస్తుంటే ఆయనే అని స్పష్టమైపోతోంది. సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మకంగా ఆయనకే పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఎలాంటి క్లిష్ల పరిస్థితులైన అవలీలగా ఛేదించి గల నేతగా పేరు తెచ్చుకున్న ట్రబుల్‌ షూటర్‌ టీ.హరీష్ రావు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.

 

ఇవే సంకేతాలు!

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్నిరోజులుగా ఐదువేల, అంతకన్నా తక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ నిర్వహించిన సమీక్షలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. కేసీఆర్ ఆదేశాలతో హరీశ్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ చేసిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్‌ ఆ బాధ్యతలు చూస్తున్నారు.  దీన్ని బట్టి చూస్తుంటే, త్వరలో ఆరోగ్య శాఖను మంత్రి హరీశ్​రావుకు అప్పగించే అవకాశాలున్నట్లు టీఆర్​ఎస్​ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 

కేసీఆర్ ఫోకస్ హరీష్ పైనే!

ఈటల రాజేందర్​ను కేబినెట్​నుంచి బర్తరఫ్​ చేసినప్పటి నుంచీ సీఎం కేసీఆరే ఆ శాఖను చూస్తున్నారు. కొంతకాలంగా సొంత నియోజకవర్గానికి పరిమితమైన హరీశ్​.. ఇప్పుడు ఆరోగ్య శాఖ పనుల్లో బిజీగా ఉంటున్నారు. వరుసగా సీఎం నిర్వహిస్తున్న హెల్త్ రివ్యూ మీటింగ్​లన్నింటిలో ఆయన పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ట్రబుల్‌ షూటర్‌నే రంగంలోకి దింపుతున్నట్లు తాజా మీటింగ్‌లను బట్టి స్పష్టమవుతోంది. మంత్రి హరీష్‌రావు వరుస సమీక్షలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.కొంతకాలంగా సొంత నియోజకవర్గానికి పరిమితమయ్యారు హరీష్‌రావు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కరోనా కట్టడి సమీక్షల్లో బిజీగా అయ్యారు. సీఎం కేసీఆర్‌ నిర్వహిస్తున్న రివ్యూ మీటింగ్‌లకు హాజరవుతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ బుధవారం పలు రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనికి సైతం హరీష్‌రావే హాజరుకావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. స‌మావేశాల్లో తీసుకునే నిర్ణయాలు, వాటి అమలుతోపాటు చేపట్టాల్సిన చర్యల పర్యవేక్షణను హరీశ్​రావుకే సీఎం అప్పగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

 

Related posts

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju