Harish Shankar: హరీశ్ శంకర్.. Harish Shankar ఈ పేరు చెప్తే ఠక్కున గుర్తొచ్చే సినిమా ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమా సృష్టించిన కలెక్షన్ల సునామీని మెగా, పవన్ ఫ్యాన్సే కాదు.. టాలీవుడ్ కూడా మర్చిపోదు. పదేళ్లకు పైగా బ్లాక్ బస్టర్ హిట్ అనే పదానికి దూరమైన పవన్ కల్యాణ్ కు, ఆయన ఫ్యాన్స్ కు మళ్లీ ఆస్థాయి కిక్కుని గబ్బర్ సింగ్ తో ఇచ్చారు. దీంతో హరీశ్ టాలీవుడ్ టాప్ డైరక్టర్ లిస్టులో చేరిపోయారు. 2012లో వచ్చిన ఈ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి సినిమా చేయలేదు. పదేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్టుపై హరీశ్ శంకర్ మరిన్ని అంచనాలు పెంచేశారు.. ఒక్క ట్వీట్ తో.
పవన్ కల్యాణ్ 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై గతంలోనే అప్డేట్ వచ్చింది. ఎంటర్ టైన్మెంట్ కి మించి ఈ సినిమా ఉండబోతోందని హరీశ్ శంకర్ గతంలోనే చెప్పారు. సహజంగానే వీరి కాంబోపై అంచనాలు ఎక్కువ. దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే.. వారి ఉత్సాహాన్ని మరింత రెట్టించేలా హరీశ్ శంకర్ చేసిన ట్వీట్ సంచనలం రేపుతోంది. 21 సంవత్సరాల క్రితం పవన్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తొలి సినిమాగా తెరకెక్కిన ‘బద్రి’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పవన్ చాలా స్టైలిష్ గా.. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది.
Read More: VV Vinayak: మెగా కాంపౌండ్ లో వినాయక్..! చిరంజీవి కోసం కథ..!?
ఇప్పుడు.. ఈ సినిమాలోని పవన్ యాక్షన్ మోడ్ క్లిప్స్ కట్ చేసి ఓ చిన్న వీడియోగా మార్చి పోస్ట్ చేశారు హరీశ్. ‘Lets witness this energy again’ అంటూ ఈ క్యాప్షన్ తో ఈ ట్వీట్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. పవన్ లోని ఈ ఎనర్జీని మళ్లీ చూద్దామంటూ స్వయంగా హరీశే చెప్తే.. అభిమానుల అంచనాలు ఏస్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. ‘అన్నా.. నువ్వెక్కడా తగ్గొద్దు..’ అంటూ ఫ్యాన్స్ మెసేజెస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది.
Let’s witness this energy again ; pic.twitter.com/2QkFIR2Vq1
— Harish Shankar .S (@harish2you) June 26, 2021
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!