NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు అప్పుడే సిద్ధం అయిపోతున్నారు. అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని మినహాయిస్తే.. 24 పార్లమెంటు.. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కరోజులో అభ్యర్థులను ప్రకటించేశారు. త్వరలోనే బస్సు యాత్ర ద్వారా రాష్ట్రం అంతటా ఎన్నికల ప్రచారాన్ని మోగించనున్నారు. ఇక వైసీపీ మేనిఫెస్టో విడుదల కావడం ఒక్కటే మిగిలి ఉంది. గతంలో నవరత్నాల పేరుతో మేనిఫెస్టోను జగన్ విడుదల చేశారు. తాజాగా జగన్ చెప్పాడు అంటే చేస్తాడంతే.. అన్న నినాదంతో రాష్ట్రం అంతటా వైసీపీ ప్రచారం హోరెత్తుతుంది.

అందుకే 2024 ఎన్నికలు మేనిఫెస్టోకు సంబంధించి తీవ్ర కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. ప్రధానంగా రైతులు, మహిళలకు ఎక్కువ ప్రయోజనం కలిగించేలా వైసీపీ కొత్త మేనిఫెస్టోపై ఆలోచన కసరత్తు జరుగుతున్నట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికలలో జగన్ మహిళలకు విడతల వారీగా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు. గత ఎన్నికల సందర్భంగా జగన్ రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తానని హామీ ఇచ్చారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6000 కలిపారు. ఆ తర్వాత ఇచ్చిన హామీ కంటే మరో వెయ్యి పెంచి ఇస్తున్నట్టు ప్రచారం చేసుకున్నారు.

అయితే ఈసారి జగన్‌కు గెలుపు అంత ఈజీ అయితే కాదు. అటు ప్రతిపక్షాలు అన్నీ ఒక్క‌టయ్యాయి. ఇటు జగన్ ఒక్కడే ఒక వైపు అటు బీజేపి, పవన్ జనసేన, టీడీపీ అన్ని ఒకవైపు ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా జగన్ గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చారు. ఇంకా చెప్పాలంటే జగన్ ఇవ్వని హామీలు కూడా చేసి చూపించారు. అయితే ఇప్పుడు జగన్ ఒకే ఒక పని చేస్తే మరోసారి సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరన్న చర్చ జరుగుతుంది. అదే రైతు రుణమాఫీ. రైతులకు కనీసం లక్ష రూపాయలైనా రుణమాఫీ చేయాలని అధికార పార్టీ అభ్యర్థుల నుంచి జగన్ పై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ దిశగా అడుగులు వేసేందుకు బ్యాంకు అధికారులు.. ఆర్థిక నిపుణుల‌తో.. జగన్ పలు విడత‌లుగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలు వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మక కావడంతో.. మరోసారి అధికారంలోకి రావాలంటే రైతు రుణమాఫీ తప్పదని.. జగన్‌కు పార్టీ నేతలు పదే పదే చెబుతున్నారట. అయితే చంద్రబాబు ఏం చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 2014 ఎన్నికలలో చంద్రబాబు పూర్తిగా రుణమాఫీ చేస్తానని ప్రచారం చేసి గెలిచారు.

అధికారంలోకి వచ్చాక ఆ రుణమాఫీ సరిగా చేయలేకపోయారు. ఏడాదికి కేవలం 25వేలు చేస్తూ వెళ్లారు. అప్పటికే చంద్రబాబును నమ్మి అప్పులు కట్టని రైతులు అందరూ వడ్డీల ఊబిలో కూరుకుపోయారు. అయితే జగన్ ఏం చెప్పినా చేస్తాడని నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. అందుకే ఇప్పుడు రైతు రుణమాఫీ హామీని ఎన్నికల ప్రధాన అస్త్రంగా వాడాలని వైసీపీ వాళ్లు జగన్ పై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?