NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారా? మీ పంట పండినట్లే: చరిత్ర తిరగరాసిన దలాల్ స్ట్రీట్

 

 

దేశ ఆర్ధిక పరిస్థితి రాన్రాను కుదేలు అవుతుంది అని… ఇలాగే ముందుకు సాగితే 2025 కల్లా పక్కదేశం బాంగ్లాదేశ్ కంటే దారుణంగా తయారు అవుతుంది అని కొన్ని ఆర్ధిక సంస్థలు నివేదికలు ఇచ్చి భయపెడుతుంటే దీన్ని బుల్ మాత్రం పట్టించుకోవడం లేదు. అది రంకెలు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది. కొత్త రికార్డులు తిరగరాస్తుంది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి లో సూచీలు కొత్త శిఖరాలను అందుకున్నాయి. దేశం మద్యం లోకి వెళ్తుంది అనే మాటలను పక్కన పెట్టి మరి పెట్టుబడిదారులు పోటీపడి బుల్ ను పరుగులు పెట్టిస్తున్నారు కరోనా నుంచి ఇంకా ప్రపంచం తేరుకోకముందే దేశ స్టాక్ ఎక్స్చేంజి లు పరుగులు పెట్టడం ప్రపంచ దేశాల ఆర్ధిక వేత్తలబే నివ్వెర పరుస్తుంది. గత వరం అంత లాభాల్లోనే ఉన్న దలాల్ స్ట్రీట్ ధనత్రయోదశి సెలవు అనంతరం మంగళవారం ఉదయం సైతం లాభాల పరుగు ఆపలేదు. ఉదయం 340 పాయింట్స్ పెరిగి 43 , 963 పాయింట్స్ లాభంతో మొదలై ఒకానొక దశలో 44 , 115 పాయింట్స్ గరిష్టాన్ని తాకింది . గతంలో ఎప్పుడు ఈ మార్క్ చేరని సెన్సెక్స్ కొత్త శిఖరాలను అందుకుని దోసుకుపోతుంది. నిఫ్టీ సైతం అదే జోరు తో 88 పాయింట్స్ ప్రారంభపు లాభాలతో 12 , 873 లకు చేరుకుంది.

ఎందుకీ ఉత్సహం ?

స్టాక్ మార్కెట్ పరుగుల వెనుక నిపుణులు కొన్ని కారణాలు చెబుతున్నారు. నిశితంగా గమనిస్తే భారత మార్కెట్ ఎందుకు విపత్తు సమయంలో సైతం కొత్త రికార్డులు తిరగరాస్తుంది అనే దాని మీద ఆర్ధిక నిపుణులు చెప్పే విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
* కొవిడ్ సమయంలో స్టాక్ మార్కెట్ లోకి యువత ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. సుమారు 80 కొత్త డీమ్యాట్ అకౌంట్ లో వివిధ బ్రోకరేజి సంస్థలు తెరిచినట్లు ఓ సర్వేలో తేలింది. జీరో దా, ఏంజెల్ బ్రోకింగ్, అప్ స్టాక్స్, వంటి సంస్థల్లో ఎక్కువ అకౌంట్ లు వచ్చాయి. ఫలితంగా మార్కెట్ కు వచ్చిన యువతరం పెట్టుబడులు పెట్టారు . దింతో మార్కెట్ పెరిగింది.
* అమెరికా ఎన్నికల్లో బిడెన్ హావ సాగడం మార్కెట్లకు జోష్ ఇచ్చింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లు కళకళలాడాయి. అదే తీరు భారతీయ మార్కెట్ల మీద చూపింది. దీనితోనే నిలకడగా రాణింపు సాధ్యం అయ్యింది.
* కరోనా విపత్తు వేళా.. దాని నుంచి మెల్లగా తేరుకుంటున్న భారతీయ విపణిలోకి సంస్థలు ప్రకటించిన మూడునెలల ఆర్ధిక లాభాలు బాగున్నాయి. బ్యాంకింగ్ , ఫైనాన్స్ , మోటార్ , సాఫ్ట్ వెర్ వంటి కంపెనీలు ప్రకటించిన ఫలితాలు వరుసగా లాభాలు రావడం మార్కెట్ కు కలిసి వచ్చింది.
* ప్రభుత్వం ప్రకటించిన విపత్తు ప్యాకేజీలు మార్కెట్ కు బలం ఇచ్చాయి. ఒకేసారి కాకుండా వివిధ రంగాలకు వేరుగా ప్యాకేజీలు ప్రకటించడం వాళ్ళ మార్కెట్ వేగం పుంజుకుంది.
* కరోనా సెకండ్ వెవ్ భయం దేశంలో లేకపోవడంతో పాటు విపత్తు తర్వాత జనజీవనం సాధారణ స్థితికి చేరడం, కొనుగోళ్ల శక్తీ సమాజంలో పెరగడం, వ్యాపారాలు పుంజుకోవడం మార్కెట్ కు ప్రధానంగా కలిసి వచ్చిన అంశాలు.
* కరోనా మొదలు అయ్యాక విదేశీ మదుపర్లు భారత మార్కెట్ నుంచి దాదాపు వెళ్లిపోయారు. ఎప్పుడు వారి రక ఎక్కువగా ఉంది. వారి పెట్టుబడులు క్రమంగా పెరగటం కలిసి వస్తోంది.

జాగ్రత్తలు అవసరం

పెరుగుట విరుగుట కొరకే అన్న సూత్రాన్ని మదుపర్లు గుర్తు ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్ విషయాలను చిన్నచిన్న వార్తలు సైతం ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. దాన్ని ఎప్పటికి అప్పుడు గమనించాలి. ఒక స్టాక్ కొన్న తర్వాత దాని టార్గెట్ పెట్టుకుని లాభాల స్వీకరణ చేసుకుంటే మేలు. అత్యాశకు పోతే మొదటికే ప్రమాదం వస్తుంది. స్టాక్స్ కదలికలు, అంతర్జాతీయ అంశాలు తెలుసుకుంటే జాగ్రత్తగా ట్రేడ్ చేయాలనీ.. లాభాల స్వీకరణకు ఎ మాత్రం అడ్డు చెప్పవద్దని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని ప్రధాన స్టాక్స్ టార్గెట్లు ఇంకా భారీగా ఉండటం, మదుపర్లు పెట్టుబడుల వైపే ద్రుష్టి పెట్టడం చూస్తుంటే సెన్సెక్స్ మరింత ముందుకు వెళ్లొచ్చు అని, అయితే ఎలాంటి చిన్న విషయం అయినా ఈ సమయంలో పెను ప్రభావం చూపుతుంది అని హెచ్చరిస్తున్నారు.

 

author avatar
Special Bureau

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju