తెలుగు ప్రేక్షకులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఆ విషయాన్ని ఇప్పటికే స్టార్ మా అధికారకంగా ప్రకటించారు. ఈ క్రమంలో రీసెంట్ గా సీజన్ 4 ప్రోమో ని రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. నాగార్జున త్రిపాత్రాభినయంతో బిగ్ బాస్ 4 ప్రోమో అదిరిపోయింది. సినిమాటిక్ గా ఉన్న ఈ ప్రోమోలో నాగ్ తన మార్క్ స్టైల్లో ఆదరగొట్టేశారు.
ఎంటర్టైన్మెంట్, కాంట్రవర్సీ..హంగామా..ఆసక్తికరమైన చర్చలు..ఇలా ఇప్పటికే సక్సస్ ఫుల్ గా మూడు సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు నాలుగో సీజన్ కి రంగం సిద్ధం అయింది. త్వరలో బిగ్ బాస్ సీజన్ 4 మొదలవబోతుంది. సీజన్ 4 కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ అని ఎప్పుడో కన్ఫర్మ్ అయిపొయింది. ఇక కంటెస్టంట్ లు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని సమాచారం. అయితే ఈగ్యాప్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సీజన్ 4 ప్రోమో వదిలారు స్టార్ మా. ఈ టీజర్ లో నాగార్జున ని చూసిన ప్రతీ ఒక్కరు సర్ప్రై అవుతున్నారు.
ఒక తాత మనవడు.. టెలిస్కోప్ వేసుకుని పక్కింటిలో విశేషాలు చూస్తుంటారు. తండ్రి వచ్చి ఏం చేస్తున్నారు అంటాడు.. అబ్బే ఏమీ లేదు వినోదం కోసం పక్కింటి విశేషాలు తెలుసుకున్తున్నాం అంటూ చెబుతారు తాతా, మనవడు.
”మైడియర్ ఇంటి సభ్యుల్లారా.. ఇంతకంటే బెటర్ ఎంటర్ టైన్మెంట్ నేను చూపిస్తా.. తీయండి రిమోట్లు ఫిక్స్ అవ్వండి బిగ్ బాస్.. నిజమైన ఎమోషన్స్, అసలైన ఎంటర్ టైన్మెంట్.. ఇక్కడంతా లైవ్” అంటూ తండ్రి సందడి చేస్తారు. మొత్తానికి ప్రోమోలో నాగార్జున మూడు పాత్రలతో మనం సినిమాని గుర్తు చేశారు. చెప్పాలంటే ఈ ప్రోమోకి మనం సినిమానే ఇన్స్పిరేషన్ కూడా.
ఇప్పుడు మా టీవీ విడుదల చేసిన బిగ్ బాస్ 4 ప్రోమో 1.16 నిమిషాల నిడివితో ఆకట్టుకునేలా రూపొందింది. సరికొత్త కాన్సెప్ట్ తో కనిపిస్తున్న ఈ ప్రోమో బిగ్ బాస్ 4 పై అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ఆగస్టు 28 లేదా 29 తేదీల్లో మొదలవుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సీజన్ లో పాల్గొనేందుకు కింగ్ నాగార్జున ప్రత్యేకంగా ఒక ప్రముఖ యాంకర్ ని రిఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు ప్రముఖ సీనియర్ యాంకర్ సుమ. అవును సుమ ని నాగార్జున రిఫర్ చేసినట్టు చెబుతున్నారు. అంటే ఈసారి బిగ్ హౌజ్ సుమ సందడి చేయబోతుందా ..వావ్ అని అనుకుంటున్నారు. మరి సుమ ఒప్పుకుంటుందా…నిజంగా ఒప్పుకుంటే బావుండు..ఇదే అభిమానులు కోరుకుంటున్నారు.