Ravi teja : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రాక్ సినిమాతో ఫుల్ ఫాంలోకి వచ్చిన రవితేజ వరసగా సినిమాలను లైనప్ చేసుకుంటున్నాడు. ఖిలాడి సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తుండగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. హవీష్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరీ, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తుండగా అనసూయ, సీనియర్ హీరో అర్జున్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ భారీగా అంచనాలు పెంచాయి. క్రాక్ మించి భారీ హిట్ రవితేజకి దక్కబోతోందని చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. కాగా ఈ సినిమా తర్వాత రవితేజ సినిమా చూపిస్త మావా, నేను లోకల్ ఫేం త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కూడా రవితేజ మరో రెండు సినిమాలని లైన్ లో పెట్టాడట. మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా ఉండనుండగా మరో కొత్త దర్శకుడితో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
Ravi teja : నభా నటేష్ గ్లామర్ ట్రీట్ ఇస్తున్నా కూడా రేస్ లో వెనకపడింది.
కాగా ఈ ప్రాజెక్ట్స్ లో ఒక ప్రాజెక్ట్ కి నభా నటేష్ ని ఎంపిక చేయాలని చూస్తున్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం నభా నటేష్ సాలీడ్ హిట్ కోసం ఎదురు చూస్తోంది. అందం, అభినయం ఉన్నా కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మళ్ళీ భారీ హిట్ దక్క లేదు. గ్లామర్ ట్రీట్ ఇస్తున్నా కూడా రేస్ లో వెనకపడింది. ప్రస్తుతం నితిన్ తో చేస్తున్న బాలీవుడ్ సినిమా అంధాదున్ మీదే ఆశలన్ని పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ టాలీవుడ్ లో అవకాశాలు ఊపందుకుంటాయి. మరి రవితేజ సినిమా విషయం ఎప్పుడు క్లారిటీ వస్తుందన్నది తెలియాల్సి ఉంది.