NewsOrbit
దైవం న్యూస్

water tap: ఇంట్లో వాటర్ టాప్ లీక్ అయితే వాస్తు ప్రకారం దోషమా?డబ్బు వృధాగా  ఖర్చు అవుతుందా? ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోండి !!

water tap:  చాలా మంది ఇళ్లలో  టాప్ నుంచి చుక్క చుక్క నీరు  పడుతుంటే  పెద్దగా పట్టించుకోరు. కానీ ఏ ఇంట్లో అయినా నీరు వృథా అవుతూ ఉంటే… ఆ ఇంట్లో దోషం ఉన్నట్లు తెలుసుకోవాలి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.   ఓ ట్యాప్ నుంచి చుక్కా చుక్కా నీరు పడుతూ ఉంటే… అది మంచి  సూచన కాదు అంటున్నారు నిపుణులు.అలా వాటర్ డ్రాప్ పడటం  వల్ల    చెడు  జరుగుతుంది అని తెలియచేస్తున్నారు.

అన్నిటికన్నా ముఖ్యంగా కిచెన్‌లోని ట్యాప్‌ లీక్  అవ్వకుండా  చూసుకోవాలి. అక్కడ గానీ నీరు వృధా అయితే అసలు మంచిది కాదు  అని తెలియ చేస్తున్నారు. వంటగది   లో   అగ్ని ఉంటుంది. అక్కడ నీరు  ఉంటుంది. గాలి ,ఇక భూమి ఎలాగూ ఉంటాయి. నాలుగు పంచభూతాలు ఉండే ప్రదేశం కావడంతో… అక్కడ ఏ చెడు జరగకుండా చూసుకోవాలని తెలియచేస్తున్నారు.ఒక వేళా  కిచెన్‌లో ట్యాప్ లీకవుతూ  ఉండి ఉంటే కనుక కుటుంబంలో ఒకరికి అనారోగ్యం వస్తుంది.  దానితో పాటు  ఆ ఇంట్లో వారు చేసే వ్యాపారంలో నష్టాలు వచ్చి డబ్బు పోతుంది. నీరు పోతే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి  అనుకుంటున్నారా?నీరు అంటే వరుణ దేవుడు.ఆయనకు తగిన ప్రాధాన్యత లేదని  వరుణ దేవుడు ఆగ్రహిస్తాడు. అంతే… ఆయన వెళ్లిపోతూ ఉంటే, ఆ ఇంట ఉండే పాజిటివ్ ఎనర్జీ ఆయనతోపాటు వెళ్ళిపోతూ ఉంటుంది. దీంతో వెలుతురు  ఉండవలసిన చోట  చీకటి వచ్చినట్టు… పాజిటివ్ ఎనర్జీ లేని చోటికి నెగిటివ్ ఎనర్జీ  వచ్చేస్తుంది. అలా అరిష్టం కలుగుతుంది. ఎవరైనా సరే ఇలాంటి లీకేజీలను నిర్లక్ష్యం  గా వదిలేయకుండా  వెంటనే సరిచేసుకోవాలి అని  వాస్తు నిపుణులు  తెలియచేస్తున్నారు.

పోనీ ఇవన్నీ మూఢ నమ్మకాలు అని పట్టించుకోని వారు సైన్స్ కోణంలో  చూడండి . నీరు వృధా అయ్యే చోట,నీరు నేలపై నిల్వ  ఉంటుంది. అక్కడ రకరకాల సూక్ష్మక్రిములు చేరిపోతాయి. అలాగే దోమలు గుడ్లు పెట్టి సంతతిని పెంచుకుంటాయి.  చివరకు ఆ నీరు డ్రైనేజీ నీరు మారి  వాసన వస్తుంది.దోమల వలన ,చెడు వాసన వలన అనేక అనారోగ్యాలు కలిగి,హాస్పిటల్స్ చుట్టూ తిరిగితే,డబ్బు కూడా నీళ్లలా ఖర్చు చేయాల్సి వస్తుంది.కాబట్టి ఈ వాస్తు దోషాలను  త్వరగా రిపేర్ చేసుకోవాలి  అని చెబుతున్నారు నిపుణులు.. సరే నిపుణులు,శాస్త్రం  ఇవన్నీ పక్కన పెట్టి చూసిన  కూడా  నీరు చాలా విలువైన వనరు. చుక్క నీటి కోసం ఎందరో అలమటించి పోతున్నారు.ఇలాంటి నీటి చుక్కలు వృథాగా పోతుంటే చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju