IT Farmer: ఐటీ జాబ్ వదిలి… 150 మంది రైతులతో 1 కోటి రూపాయల సంస్థ స్థాపించి పార్థసారథి జర్నీ తెలుసా?

IT Farmer
Share

IT Farmer: కోట్లు కుమ్మరించే ఐటి జాబ్ వదిలేసి విదేశాల్లో విలాసవంతమైన జీవనం కాదనుకుని వ్యవసాయం పైన ఆధార పడుతూ తన మిగిలిన జీవితాన్ని అంకితం చేశాడు పార్థసారధి. గత పది సంవత్సరాలుగా తన ఇంటి వారిని అప్పుల నుండి బయటపడేయడమే కాకుండా కొన్ని వందల రైతులను కష్టాల నుండి బయట పడేసిన పార్థసారధి అసలు ఇదంతా ఎలా జరిగిందో ఇండియాకి వివరించారు.

 

IT Farmer

 

అప్పట్లో అలా బతికి….

ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఉప్పనేసినపల్లి గ్రామానికి చెందిన నాగ పార్థసారథి వ్యవసాయ కుటుంబంలో పెరిగాడు. అతని తాత ముత్తాతల నుండి 90 ఎకరాల భూమిని వ్యవసాయం చేస్తూ వచ్చారు. పార్థసారథి తాతగారు పొలంలోనే చిరుధాన్యాలు, కూరగాయలు పండిస్తూ జీవితం గడిపేవారు. దీంతో కరువు సమయంలో కూడా వారి ఇంటికి తిండి కొరత ఉండేది కాదు. కాబట్టి నూనె వంటి అతి కొద్ది అత్యవసర పదార్థాలను మాత్రమే డబ్బు వెచ్చించే వారం 90 కాస్తా 120 ఎకరాలు అయ్యాయి. 30 మంది కూలీలు ప్రతిరోజు పని చేస్తూ హాయిగా జీవితం గడిపేవారు.

రసాయన ఎరువులు కొంపముంచాయి...

అయితే కాలం మారింది ప్రకృతి పరంగా సహజసిద్ధమైన విధానాలను వదిలేసి అందరూ రసాయన మందులు వైపు దారి పట్టారు. దీంతో రైతు వ్యవసాయం చేసేందుకు అయ్యే ఖర్చు. సరైన రాబడి ఉన్నా రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. ఒక్క పార్థసారథి ఇంటి నుండి 50 కుటుంబాలు భూమిని నమ్ముకొని బతికేవారు. అయితే ఈ రసాయన మందుల వల్ల ప్రతి ఒక్కరూ ఆర్థికంగా నష్టపోయారు.

ఇక 2001లో కంప్యూటర్ సైన్స్లో పీజీ చేసిన పార్థసారథి రాయలసీమ యూనివర్సిటీ నుండి పట్టా బయటికొచ్చాడు. ఐటీ సెక్టార్ అప్పట్లో స్థిరంగా లేదు. దీంతో వారి కుటుంబం ఆర్థికంగా మరింత దీనస్థితిలో . 2004లో పార్థసారధి ఉద్యోగం సంపాదించి అమెరికా కూడా . కానీ వాళ్ళ తాత ముత్తాతల నుండి వ్యవసాయాన్ని జీవనోపాధిగా నిర్మించిన విషయం మాత్రం మైండ్ లోనే తిరుగుతూ ఉంది.

IT Farmer

2008లో భారతదేశం వచ్చేసిన పార్థసారధి బెంగళూరులో తన ఉద్యోగాన్ని కొనసాగించాడు. ప్రతి వారం సెలవు రోజుల్లో ఇంటి దగ్గరికి వచ్చి వ్యవసాయం చేసే వాడు.మొదట నిమ్మకాయలు అతను ఐదు సంవత్సరాల లోనే బాగా అభివృద్ధి చెందాడు. 2009లో ఒకసారి కొత్త రకం అరటి తో ఒక ప్రయోగం చేశాడు. అయితే అందులో కేవలం 40 శాతం మాత్రమే అమ్ముడుపోయాయి. 30 శాతం అయితే పూర్తిగా వ్యర్థం అయిపోయాయి. మిగిలింది కుటుంబం స్నేహితులు మధ్య పంచేసేవారు.

అన్నీ నష్టాలే

ఆ తర్వాత ఏడు లక్షల పెట్టుబడి పెట్టి 11 లక్షలకు అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నారు. వారు కేవలం ఆరు లక్షలు ఇవ్వడంతో అతను అప్పుల్లో వెళ్ళిపోయాడు. అంతకు ముందు కూడా వారి గ్రామంలో వారు ప్రకృతి సిద్ధ వ్యవసాయం చేసి పంట పండించినప్పటికీ బొప్పాయి ఎలా మార్కెటింగ్ చేయాలన్న దానిపై అవగాహన లేక భారీ నష్టాన్ని ఎదుర్కొన్నారు. దీంతో పార్థసారథి ఆశయానికి చుక్కెదురైంది.

కానీ 2012లో ఒక తెలుగు వారపత్రిక లో సాధారణ పద్ధతిలో వ్యవసాయం చేయడం ఎలా అనే ఒక ఆర్టికల్ . మొత్తం తెలంగాణ అంతా వర్క్ షాపులు వారు నిర్వహిస్తుండగా దాని గురించి తెలుసుకున్నాడు. కొత్త వ్యవసాయ పద్ధతుల గురించి కుటుంబంతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాడు.

IT Farmer: ఆ మ్యాగజైన్ తన జీవితం మార్చింది…

2013లో జీరో బడ్జెట్ ప్రకృతి ఫార్మింగ్ ఆరంభించారు. రసాయనాలను నమ్ముకోకుండా ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, వరిపొట్టు, నీరు కలిపి ఎరువును తయారు . 2014లో అది అసమాన రిజల్ట్ తీసుకొని వచ్చింది. ఇంక అంతే టాక్సిన్ ఫ్రీ అంటే విషపదార్థాలు లేని పంటలను పండించి అధిక లాభాల. గతంలో 40 కిలోల పండ్లు వస్తే ఈ పద్ధతి మారిన తర్వాత ఒక్క అరటి చెట్టు నుండి 70 కిలోల పంట చేతికి వచ్చింది. కొత్తగా ఆలోచించి మూడు ఎకరాలకు ఒక పంట వేయడం మొదలపెట్టారు. గ్రామాల నుండి మొదలుపెట్టి అసాధారణ వృద్ధి రేటు సాధించి రెండు వారాల్లోనే నాలుగు వేలకు పైగా వ్యాపారస్తులు నుండి అతనికి ఫోన్ కాల్స్ రావడం మొదలుపెట్టాయి. అగ్రికల్చర్ ఆఫీసర్లు, వ్యవసాయం చదివే విద్యార్థులు అతని అని కొనియాడారు. అలా మరొక 20 ఎకరాలు తన వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు.

ఇలా పార్థసారధి ఐటి జాబ్ వదిలేసి మరొక 150 రైతులను ప్రకృతి సహజ సిద్ధమైన వ్యవసాయం వైపు మారేందుకు దారి చూపించాడు. సంవత్సరానికి కోటి రూపాయలు బిజినెస్ జరుపుతూ ప్రతి ఒక్కరికి భారత ప్రాచీన వ్యవసాయ పద్ధతుల విశిష్టతను ఘనంగా తెలియజేశాడు. ప్రతి సంవత్సరం 40 లక్షల కోట్ల లాభం చూస్తున్నాడతను. డబ్బు కన్నా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాల అభివృద్ధి తన లక్ష్యమని తెలిపారు పార్థసారథి.

 

 

 

 

 

 

 

 


Share

Related posts

Alia Bhatt Latest Beautiful Photos

Gallery Desk

ఏపీలో తుస్సుమన్న బీజేపీ అస్త్రం..??

sekhar

Job alert: క్రీడాకారులకు ఐటీ శాఖలో సువర్ణ అవకాశాలు..! ధరఖాస్తు చేసుకోవడం ఇలా..!!

somaraju sharma