NewsOrbit
న్యూస్

చంద్రబాబు ఎలా ఆడాలో డిసైడ్ చేస్తున్న జగన్ ! ఇది మామూలు ఆట కాదు !!

అమరావతి తప్పితే ప్రతిపక్షాలకు ప్రజారోగ్య౦ పట్టడంలేదు.ఎప్పుడైతే మూడు రాజధానులు బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలిపారో అప్పటినుండి ప్రధాన ప్రతిపక్షం టిడిపి తో సహా ఇతర విపక్షాలు అన్నీ ఆ అంశంపైనే దృష్టి కేంద్రీకరించాయి.

Jagan decides how to play Chandrababu This is no ordinary game
Jagan decides how to play Chandrababu This is no ordinary game

అమరావతి విషయంలో డెడ్లైన్ ఇవ్వడ ప్రభుత్వానికి అల్టిమేట్ ఇవ్వడం వంటి కార్యక్రమాలకు టిడిపి పరిమితమైంది. ఆ విషయంలో కూడా టిడిపి విఫలమైంది. ఇక జనసేన అయితే రాజధాని తరలింపు కి నిరసనగా గుంటూరు కృష్ణా జిల్లాల వైసీపీ టీడీపీ ప్రజా ప్రతినిధులు నాయకులు రాజీనామా చేయాలని పిలుపునిచ్చి సరిపెట్టుకుంది. అయితే ప్రస్తుతం అమరావతి అంశం కంటే విజృంభిస్తున్న కరోనానే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద విపత్కర పరిస్థితి.

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. విపక్షాలు ఈ విషయం మర్చిపోయి ఆవేశంగా రాజధాని అంశం భుజానికి ఎత్తుకుని ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రాజధాని విషయంలో మాట్లాడటం తప్పు లేదు గాని ఏపీలో కరోనా తీవ్రత విపక్షాలకు కూడా కనబడకపోవడం దారుణం. ఏపీలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది అని ప్రభుత్వమే ప్రకటిస్తున్న లెక్కలు చెబుతున్నాయి. దీన్ని ప్రతిపక్షాలు పట్టించుకోకపోవడమేమిటో?మహారాష్ట్రలో రెండు వేల నుంచి 10 వేలకు వెళ్ళడానికి మూడు నెలల సమయం పడితే, ఎపీకి మాత్రం పట్టింది 10 రోజులే. రోజు వారీ కేసులు పది రోజుల్లోనే రెండు వేల నుంచి పది వేలకి పెరిగాయి.మహారాష్ట్రలో రెండు వేల నుంచి 10 వేలకు వెళ్ళడానికి మూడు నెలల సమయం పడితే, ఎపీకి మాత్రం పట్టింది 10 రోజులే.

అంటే తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పదుల్లో మొదలైన మరణాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ 100 కు పెరిగింది .రికవరీ రేటు జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉంది .వైద్య సేవలను కూడా అందించలేని పరిస్థితిలో ఏపీ సర్కార్ ఉంది అంటున్నారు. టెస్ట్ లు రోజూ భారీగా చేస్తున్నామని ప్రకటిస్తున్నా, టెస్టుల విషయంలో ప్రభుత్వం పై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ఆధార్, మొబైల్ నంబర్ తీసుకుని టెస్టులు చేసినట్లు రాసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ విపక్షాలు కరోనా విషయాన్ని దాదాపుగా లైట్ తీసుకున్నాయి. సాధారణంగా ప్రతిపక్షం అనేది ప్రభుత్వం వైఫల్యం ఏది కనిపించినా ప్రజల్లోకి వెళుతుంది. కరోనా అనేది పెద్ద పాయింట్ గా ప్రతిపక్షాలకు దొరికినా దాన్ని వారు ఉపయోగించుకోకపోవడం జగన్ ప్రభుత్వ అదృష్టమనే చెప్పాలి.

author avatar
Yandamuri

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju