NewsOrbit
5th ఎస్టేట్ Featured

ABN ఆర్కే రాజ్యాంగంలో ఇది “న్యాయ వ్యవస్థ”పై పోరాటమా…!!

YS Jagan: Can Control Central upto 2024

చూడ కాగితమంతనొక్క పోలికనుడు…! పేజీ తిప్పి చూడ అక్షర పురుగులుండు…! మీడియానందు ఆంధ్రజ్యోతి (ఆర్కే) వేరయా……!! ఏబీఎన్ ఆర్కేది వారానికో బాధ. వారానికో “పసుపు రాజ్యాంగ ఆర్టికల్స్” రాసుకుంటూ తనకే చెల్లిన వింతలు.., విశేషాలు.., విశ్లేషణాలుగా అక్షరీకరిస్తారు. ఇక ఈ రోజు ఆయన పలికిన పలుకుల్లో రాష్ట్ర భవిష్యత్తుపై.., న్యాయవ్యవస్థపై ఆయన బాధలు కనిపించాయి. పాపం…! చంద్రబాబు నాయుడో.., లోకేష్ నాయుడో.., ఆ తర్వాత చిట్టి (దేవాన్ష్) నాయుడో సీఎంలుగా ఉండి ఉంటె ఏపీలో అంతా బాగుండేది, రాష్ట్రమూ బాగుండేది, న్యాయవ్యవస్థ బాగుండేదనేది ఆర్కే బాధ కాబోలు. కానీ ఎవరున్నా ఇక్కడ అదే పరిస్థితి. కాకపోతే జగన్ అనే ఒక “మూడ్” ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో న్యాయవ్యవస్థ, పాలనావ్యవస్థ అన్ని చిల్లర దుకాణాల దగ్గర చర్చ అంశాలుగా మారుతున్నాయి.

ఈశ్వరయ్య ఎందుకు తిరగబడ్డారు…! ఆర్కేకి తెలియనిది కాదు…!!

జస్టిస్ ఈశ్వరయ్యని ఇప్పుడు ఏబీఎన్ ఆర్కే, చంద్రబాబు బృందం టార్గెట్ చేసింది. అందుకు ఈశ్వరయ్య కూడా కొన్ని తప్పులతో బలయ్యారు. చిల్లర వ్యాఖ్యలతో చిక్కుకుపోయారు. అయితే ఈ వ్యవహారంలో “ఈశ్వరయ్య నాడు హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడంలో చంద్రబాబు కారకుడు అన్నట్టు రాసుకొచ్చారు. అలా చంద్రబాబు ఈయనకు నీడనిస్తే ఈయన ఇప్పుడు విషం చిమ్ముతున్నారు” అనేది ఆర్కే బాధ.

 

ఇక్కడ ఓ కీలక అంశాన్ని ఆర్కే వదిలేశారు. ఈశ్వరయ్య ఇప్పుడు చంద్రబాబుపై రివర్స్ అవ్వడానికి.., జగన్ కి జై కొట్టడానికి కారకుడు ఎవరో, ఏమిటో, ఏం జరిగిందో మొత్తం ఆర్కేకి తెలుసు. నాడు చంద్రబాబు జాస్తి చలమేశ్వర్ ద్వారా కొంత చర్చలు నడిపి ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నది ఒక అంతర్గత కారణం. అదే కారణం ఇప్పుడు ఈశ్వరయ్యని చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉసిగొల్పింది.
* ఇక జగన్ అక్రమాస్తుల కేసులో ఈశ్వరయ్య జగన్ కి వ్యతిరేకంగా వ్యవహరించారు అంటూ నూరిపోసె ప్రయత్నం చేశారు. ఇది జగన్ కి, ఆ బృందానికి తెలియని అంశమూ కాదు, అది తెలిసి తెలిసి జగన్ అనే ముఖ్యమంత్రి ఈశ్వరయ్యకి ఆ పదవి ఇచ్చేవాడూ కాదు. ఈ కారణాలు, అంశాలు ఆర్కేకి తెలియనివి కాదు. కాకపోతే తన వారం వారం రాజ్యాంగంలో కొన్ని చీకటి రాతలు ఉండాలి కాబట్టి తనే పెద్ద పరిశోధన రాసినట్టు ఈ లైన్లు రాస్తుంటారు.

న్యాయవ్యవస్థపై కొత్త ఆరోపణలు ఏమి కాదుగా…!!

ఇప్పుడు చెప్పుకోవాల్సింది మరో కీలక అంశం. న్యాయవ్యవస్థలో అధర్మం.., అన్యాయం… అనేది దేశంలో కొత్త అంశాలేమి కాదు. గడిచిన దశాబ్దం నుండీ దేశంలో న్యాయవ్యవస్థపై మచ్చలు పడుతూనే ఉన్నాయి. మనకు బాగా తెలిసిన నాయకులే ఉన్నారు. “న్యాయవ్యవస్ధలను మేనేజ్ చేసి కేసుల తప్పుకునేది కొందరు ఉంటె.., ఈ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని ప్రత్యర్థులకు చుక్కలు చూపించేది కొందరున్నారు. ఇక ఈ వ్యవస్థల్లో తమకు అనుకూలులతో రాజకీయ గాలం వేసి తమ కార్యాలు జరిపించుకునేది ఇంకొందరు. ఇలా దేశంలోని న్యాయవ్యవస్థలతో ఎవరికీ కావలసినట్టు వారు ఆడుకుంటున్నారు. పైన చెప్పుకున్న మూడు విధానాలను మన రాష్ట్రంలోని మూడు పార్టీలు, అధినేతలు ఫాలో అవుతున్నారు. దీనిలో చంద్రబాబు, ఏబీఎన్ ఆర్కే చివరి విధానం (ఈ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని ప్రత్యర్థులకు చుక్కలు చూపించేది కొందరున్నారు) పై పోరాడుతున్నారు. కానీ వారు మొదటి విధానంలో ఉన్నారన్న విషయాన్నీ మర్చిపోయారేమో. అంచేత దేశంలో న్యాయవ్యవస్థ.., రాజ్యాంగం అనేవి చుట్టలుగా మారాయి.

ఎవరి ప్రయోజనాలు పోతున్నాయో…!!

కేంద్రం అయోధ్య కోసం.., ఏపీలో జగన్ మూడు రాజధానుల కోసం.., తెలంగాణాలో సీఎం కేసీఆర్ సచివాలయం కోసం పట్టుపట్టి కరోనా వంటి ప్రాణాంతక వ్యాధి ముదురుతున్న పట్టించుకోవడం లేదని… ప్రజలు కూడా అదే ధోరణిలో ఉన్నారంటూ ఆర్కే చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా, ప్రజా ప్రయోజనాలు పట్టకుండా వ్యవహరిస్తున్నారని రాశారు. “నిజమే..! కరోనాని ఎదుర్కోవడంలో ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. చంద్రబాబు ఉన్నంత మాత్రాన చేసేదేమి లేదు.” ఏపీలో అయినా, తెలంగాణాలో అయినా, కేంద్రంలో అయినా నేడైనా.., అయిదేళ్ల కిందట అయినా ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం… పార్టీలు ఆలోచించేది రాజకీయ ప్రయోజనాలకే.., అది కరోనా కానీ, దాని అమ్మమ్మ కానీ… దీనికి బీజం వేసింది, రాజకీయ ప్రయోజనాలకు రాష్ట్రాలను బలి చేయడంలో ముందడుగు వేసింది చంద్రబాబు మాత్రమే. వాటినే ఈ సీఎంలు కొనసాగిస్తున్నారు.

Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

August 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 28 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

siddhu

Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Raamanjaneya

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Raamanjaneya

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau