NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ టీడీపీ క్యాండెట్‌పై జ‌గ‌న్ ముద్ర‌… తుడిచేయ‌డం క‌ష్టంగా ఉందా…!

Jagan's imprint on that TDP candidate... is it difficult to erase

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీ కొంద‌రికి టికెట్లు ఇవ్వ‌లేదు. దీంతో ఇలాంటి వారు పొరుగు పార్టీ ల్లోకి వెళ్లి టికెట్లు తెచ్చుకున్నారు. రాజ‌కీయాల్లో ఇది స‌హ‌జం. ఎవ‌రు ఎవ‌రినైనా ఆశించ‌వ‌చ్చు. ఆశ్ర‌యిం చవ‌చ్చు కూడా. ఇలా పొరుగు పార్టీల్లోకి వెళ్లిన‌వారు.. అక్క‌డ టికెట్లు కూడా తీసుకున్నారు. వీరిలో కొంద‌రికి టికెట్లు కూడా ప్ర‌క‌టించారు. ఉదాహ‌ర‌ణ‌కు కొలుసు పార్థ‌సార‌థి (పెన‌మ‌లూరు)కి నూజివీడు టికెట్ ఇచ్చా రు. దీంతో ఆయ‌న గురువారం అక్క‌డ ప‌ర్య‌టించారు.

అస‌లు నూజివీడు నాడి ఎలా ఉందో చూసుకుందామ‌ని ప్ర‌య‌త్నించారు. ఎందుకంటే.. కొలుసుకు ఇది కొత్త నియోజ‌క‌వ‌ర్గం. గ‌తంలో ఎప్పుడూ పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గం కాదు. దీంతో కొద్ది మంది గ్రామ‌స్థుల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నను స్థానికులు.. వైసీపీ నాయ‌కుడిగానే చూడ‌డం గ‌మనా ర్హం. నిజానికి కొంద‌రికి కొలుసు పార్టీ మారిన‌ట్టుగా తెలియ‌క‌పోవ‌డం మ‌రింత చిత్రం. ఆయ‌న‌ను చూసిన వారు ఏదో వైసీపీ త‌ర‌ఫున ప్ర‌చారానికి వ‌చ్చార‌ని అనుకున్నారు.

ఇది వాస్త‌వం. కొంద‌రు రైతులు.. కొలుసుతో మాట్లాడుతూ.. భ‌రోసా కేంద్రాలు బాగున్నాయ‌ని చెప్పారు. ఇం కొంద‌రు.. అన్ని ప‌థ‌కాలు బాగున్నాయ‌ని.. త‌మ ఓటు వైసీపీకేన‌ని చెప్ప‌డంతో కొలుసు నివ్వెర పోయారు. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని చూసి ఆయ‌న ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. చిత్రంఏంటంటే.. త‌న‌ను తాను ఇక్క‌డి వారికి ప‌రిచ‌యం చేసుకుని. వైసీపీకి తాను రిజైన్ చేశాన‌ని.. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్నాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఇక్క‌డ మ‌రో గ‌మ్మ‌త్తు జ‌రిగింది. ఆయ‌న అలా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాన‌ని చెప్ప‌డంతో వెంట‌నే అక్క‌డున్న వాళ్లంతా.. అయితే.. ఈసారి త‌మ ఓటు టీడీపీకేన‌ని చెప్ప‌డంతో కొలుసుకు న‌వ్వాగ‌లేదు. అయితే, ఆయ‌న‌కు మాత్రం ఒక విష‌యం బాగానే అర్థ‌మైంది. వైసీపీ ప‌థ‌కాలు గ్రామీణ ప్రాంతంలో బ‌లమైన ముద్ర వేశాయని గుర్తించారు. దీని నుంచి ఓటు బ్యాంకును త‌న‌వైపు మ‌ళ్లించుకునే విష‌యంపై ఆయ‌న పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశం పెట్టి నిర్ణ‌యించాల‌ని భావిస్తున్నారు.ఇదీ.. సంగ‌తి!!

Related posts

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella