NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena TDP Alliance: జనసేన – టీడీపీ సీట్ల సర్దుబాటుపై హరిరామ జోగయ్య పెదవి విరుపు .. కీలక అంశాలు ప్రస్థావిస్తూ బహిరంగ లేఖ విడుదల

Janasena TDP Alliance: టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కావడం, జనసేనకు 25 నుండి 30 స్థానాలు అంటూ మీడియాలో కథనాలు రావడంపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు పవన్ కు సూటిగా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ మరో లేఖ రాశారు.

చంద్రబాబుకు అధికారం కోసం కాపులు పవన్ వెంట నడవడం లేదని పేర్కొన్నారు. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. రెండున్నరేళ్లు పవన్ సీఎంగా ఉంటారనే మాట చంద్రబాబుతో చెప్పించి తీరాలని హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. 175 సీట్లు ఉన్న రాష్ట్రంలో 50 సీట్లు అయినా దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని అన్నారు.

జనసేన కనీసం 40 నుండి 60 సీట్ల మధ్య పోటీ చేసి తీరాలని మరో సారి సూచించారు హరిరామ జోగయ్య. అధికారం అంతా చంద్రబాబుకే ధారపోస్తే మీరు కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా సాధ్యమవుతాయని పవన్ ను ప్రశ్నించారు. జనసేనకు 27 లదా 30 సీట్లు అంటూ ఏకపక్షంగా ఎల్లో మీడియా ఎవరిని ఉద్దరించడానికని ప్రశ్నించారు.

వైఎస్ఆర్ సీపీని రాజ్యాధికారం నుండి తప్పించడం అంటే టీడీపీకి  రాజ్యాధికారం కట్టబెట్టడం మాత్రమే కాదని..అసలు కాపు సామాజికవర్గం పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణం చేస్తుంది ఈ ఆలోచనతో కాదనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. జనసేన మద్దతు లేకుండా టీడీపీ అధికారంలోకి రావడం కష్టమని, అందుకు 2019 ఫలితాలే ఉదాహరణ అని హరిరామ జోగయ్య పేర్కొన్నారు.

బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కించుకోగలుగుతారనే పిచ్చి నమ్మకంతోనే కాపు సామాజికవర్గంలో అధిక సంఖ్యాకులు పవన్ కళ్యాణ్ వెండ నడుస్తున్నారన్నారు. 175 సీట్లు ఉన్న రాష్ట్రంలో కనీసం 50 సీట్లయినా జనసేన దక్కించుకోగల్గితేనే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా దక్కే అవకాశం ఉంటుందన్నారు. జనసైనికులు సంతృప్తి పడేలా సీట్లు పంపకం కాకపోయినా సీఎం పదవి రెండున్నరేళ్లు పవన్ కు కట్టబెట్టబోతున్నట్లుగా ఎన్నికల ముందే చంద్రబాబు నోటి వెంట ప్రకటించగల్గుతారా అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నలకు పవన్ నుండి జనసైనికులు సంతృప్తి చెందేలా సమాధానాలు  రాగల్గితే ఎన్నికలంతా సవ్యంగానే జరుగుతాయన్నారు. కాపు సామాజికవర్గానికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు బలమైన అభ్యర్ధులు ఉండి జనాభా ప్రాతిపదికన సీట్లు పంపకం జరక్కపోయినా ఓట్ల ట్రాన్స్ ఫర్ సవ్యంగా జరగక వారు అనుకున్నది సాధించలేని ప్రమాదం ఉందని, దానికి వారు ఇద్దరే కారణం అవుతారని అన్నారు.

AP Assembly: గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు .. సభ నుండి టీడీపీ సభ్యులు వాకౌట్

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N