Karthika Deepam highlights: కార్తీక దీపం ఈ వారం హైలైట్స్ మీ కోసం ….!

karthika deepam highlights
Share

Karthika Deepam highlights: కార్తీక దీపం సీరియల్ రోజురోజుకీ మరింత ఉత్కంఠ భరితంగా ముందుకు సాగుతూ వెళుతుంది. మరి ఈ వారం కార్తీక దీపం సీరియల్ లో హైలైట్స్ ఏంటో ఒకసారి నెమరు వేసుకుందామా… శ్రీవల్లి, కోటేష్ బాబును రుద్రాణి ఎత్తుకుపోవడంతో వాళ్లు రుద్రాణి మీద కేసు పెడతారు. రుద్రాణిని అరెస్ట్ చేయడం, బాబు తిరిగి శ్రీవల్లి, కోటేష్ వాళ్లని చేరుకోవడం జరుగుతుంది. అయితే రుద్రాణి శ్రీవల్లీ వాళ్ల మీద కోపంతో రగిలిపోతూ పెద్ద తప్పు చేశావ్’ అని మనసులోనే ఆవేశంతో ఊగిపోతుంది. మరో పక్క కార్తీక్ విషయంలో మాకు సహాయం చేయమని మహేష్ అనే బిచ్చగాడిని అడుగుతుంది సౌందర్య. దీప రుద్రాణి అరెస్ట్ అవ్వడంతో చాలా హ్యాపీగా ఉంటుంది. మరోపక్క కార్తీక అలాంటి వారిలో మార్పు ఎప్పటికి రాదు.పైగా పగ పట్టే ప్రమాదం కూడా ఉంటుంది అంటాడు దీపతో.. రుద్రాణి రౌడీలకు.కోటేష్, శ్రీవల్లిని ఉద్దేశించి బలి ఇవ్వాలి ఏర్పాట్లు చేయమని అంటుంది.

Karthika Deepam highlights: శ్రీవల్లి, కోటేష్ లను చంపించిన రుద్రాణి

karthika deepam highlights

ఇక బస్తీలోనే ఉంటున్న మోనితకి అక్కడ బస్తీవాసులు పాలు, పేపర్ లాంటివి అమ్మకుండా చుక్కలు చూపిస్తారు. మరోపక్క శ్రీవల్లి, కోటేష్‌లు గుడికి వెళ్లడానికి సిద్ధం అయ్యి బాబుని చూసుకోమని దీపకు చెప్పి స్కూటర్ మీద బయలుదేరతారు.బాబు మాత్రం కార్తీక్ ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తాడు. వాడిని చూసి కార్తీక ఏంట్రా నీకు నాకు ఉన్న అనుబంధం’ అనుకుంటాడు మనసులో. మరోపక్క రుద్రాణి మనుషులు ఓ పెద్ద లారీతో శ్రీవల్లి, కోటేష్‌లు వెళ్తున్న స్కూటర్‌ని గుద్దిస్తారు. దాంతో వాళ్లు ఎగిరి రాళ్లపై పడటంతో తలలు పగిలి చనిపోతారు.ఈ విషయం తెలిసి ఆవేశంగా కార్తీక్ రుద్రాణితో.. ‘అసలు నువ్వు మనిషివేనా.? ఇద్దరు అమాయకుల్ని చంపుతావా? అని తిడతాడు. అవును వాళ్లని నేనే చంపించాను అంటుంది రుద్రాణి. అలాగే అగ్రిమెంట్ ప్రకారం మీరు డబ్బు చెల్లించకపోతే మీ కూతురు హిమని కూడా నేను దత్తత తీసుకుంటాను అంటుంది. కార్తీక్ బాధపడుతూ వెళ్ళిపోతాడు.

రుద్రాణి దీపను ఏమన్నా చేసిందా.. ఆందోళనలో కార్తీక్..

karthika deepam highlights

సీన్ కట్ చేస్తే రుద్రాణి కార్తీక్ దగ్గరకు వెళ్లి ని పెళ్ళాం జాగ్రత్త అని బెదిరిస్తుంది. అసలే రోజులు బాగాలేవు, ఎవరి టైమ్ ఎలా ఉంటుందో అని వెళ్లి పోతుంది. కార్తీక్ ఆలోచనలో పడి ఎంతసేపటికి దీప రాకపోవడంతో వెతకడానికి వెళ్తాడు. మరో పక్క కార్తీక్ ను వెతుకుంటూ బిచ్చగాడు తాడికొండ గ్రామానికి వచ్చి కార్తీక్ ఫొటో చూపించి అందరిని ఈయన మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. ఈలోపు క్యారియర్ తీసుకుని రుద్రాణి పిల్లల దగ్గరకు వచ్చి తినమంటే.. “మీరెవరు మాకు లంచ్ తేవడానికి?? మేం తినం!” అని అంటారు. ఈలోపు కార్తీక్ వచ్చి రుద్రాణిని.. తిట్టిపోసి అక్కడి నుంచి పంపిస్తాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన దీపతో జాగ్రత్తగా ఉండమంటాడు.

అసలు విషయం తెలిసి షాక్ లో దీప..

karthika deepam highlights

సీన్ కట్ చేస్తే రుద్రాణి ఎందుకు మాటిమాటికి ఇంటికొస్తోంది, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది నా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నారా అని అడుగుతుంది దీప.రుద్రాణి పెట్టిన గడువులోగా బాకీ సొమ్ము చెల్లించకపోతే పిల్లల్లో ఒకర్ని తీసుకెళ్లిపోతానందని అసలు నిజం చెబుతాడు కార్తీక్. అది విని షాక్ అయిన దీప మీరు సంతకం పెడితే నా బిడ్డని తను ఎలా తీసుకెళుతుంది..అంతా మీ ఇష్టమేనా దేవుడా ఏంటిది అని బోరున విలపిస్తుంది.కార్తీక్ కూడా చూసుకోకుండా సంతకం పెట్టాను అని బాధపడుతుంటే మనం ఇప్పుడు ఆవేశపడి ఏమి చేయలేము,ఎలాగైనా అప్పు తీర్చేద్దాం అంటుంది. నీ మంచితనం,ఓపిక రోజురోజుకీ నన్ను కుచించుకుపోయేలా చేస్తున్నాయి దీప,నన్ను కసితిరా తిట్టు అంటాడు కార్తీక్.

పాపం దీప మోనిత కొడుకుని విపును కట్టుకుని జంతికలు అమ్ముతూ..?

karthika deepam highlights

మరుసటి రోజు పాపం దీప చేతిలో రెండు బ్యాగ్స్ పట్టుకుని, మోనిత కొడుకుని వీపుకి కట్టుకుని, రోడ్లు వేమ్మటి షాప్స్ అన్ని తిరుగుతూ జంతికలు అమ్ముతూ ఉంటుంది.కానీ రుద్రాణి దీప కంటే ముందుగానే షాప్స్ లో తన జంతికలను అమ్మేస్తుంది. షాప్ వాళ్ళు ఎవరు దీప తెచ్చిన జంతికలు తీసుకోరు. మరోపక్క క్యారేజ్ ఇవ్వడానికి కార్తీక్ పిల్లల దగ్గరకు వెళ్ళి క్యారేజ్ ఇచ్చేలోపు ఒక పిల్ల పరుగున వచ్చి చూసుకోకుండా కార్తీక్‌ని గుద్దడంతో తెచ్చిన క్యారేజ్ కాస్త కింద పడి మొత్తం అన్నం కింద పడిపోతుంది. ఇక ఆనందారావు ఆరోగ్యంగా సరిగా లేదని ఆశ్రమంలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతారు. అలాగే మోనిత ఇంట్లోకి కేరళ నుంచి విన్నీ అనే కొత్త పని మనిషి ఎంట్రీ ఇస్తుంది.

అప్పు తీర్చడానికి ఆ దేవతే వస్తుందన్న దీప. ఎవరా… దేవత..

karthika deepam highlights

మరోవైపు దీప జంతికల డబ్బా పట్టుకుని రోడ్డు మీద నడిచి వస్తుంటే రుద్రాణి వచ్చి మీరు నా అప్పు తీర్చలేరు గాని మీ పిల్లల్లో ఒకరిని నాకు ఇచ్చేయ్’ అంటుంది. దాంతో దీప ఆవేశంగా.. రుద్రాణి గారు అంటూ కొట్టబోతుంటే అక్కడ ఉన్న ముగ్గురు రౌడీలు ఒక అడుగు ముందుకు వేసి, దీప ఆవేశాన్ని చూసి మళ్ళీ వెనుక అడుగు వేస్తారు. నేనుఅప్పు తీరుస్తాను అని గట్టిగా సమాధానం ఇచ్చి.. వెళ్లబోతుంటే.. ‘ఎలా తీరుస్తారు? దేవుడు వచ్చి తీరుస్తాడా? అంటుంది. అందుకు దీప నవ్వుతూ ‘దేవుడే వస్తాడో దేవతే వస్తుందో ఎవరు చెప్పగలరు?’ అంటూ వెళ్లిపోతుంది.మరో పక్క కార్తీక పిల్లల ఆకలి ఎలా తీర్చాలో అనే ఆలోచనలో ఉంటాడు. ఇలా ఈ వారం అంతా ఎంతో రసవత్తరంగా కార్తీకదీపం సీరియల్ ముందుకు సాగింది.


Share

Related posts

బీజేపీకి భంగపాటు!

Siva Prasad

1 మిలియ‌న్ క్ల‌బ్‌లో ‘సైరా’

Siva Prasad

Blood Pressure: మందులు వాడకుండానే బీపీ తగ్గుతుంది.. ఎలాగంటారా..!?

bharani jella