Lingayats: యడ్యురప్ప అయినా… బసవరాజ్ బొమ్మై అయినా వీరి సపోర్టు లేకపోతే డమ్మీలే… పదవులు ఢమాలే

Lingayats are kingmakers in Karnataka politics
Share

Lingayats: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇది దేశ రాజకీయాలలో పెద్ద సంచలనానికి దారి తీసింది. అయితే అతని స్థానంలో మరొక బీజేపీ నేత అయినా బసవరాజ్ బొమ్మయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు. కానీ ఎడ్యూరప్ప లాగా బసవరాజ్ కర్ణాటక రాజకీయాలలో అంత ఎత్తుకి ఎదిగింది అతనికి ప్రత్యేకించి కర్ణాటకలోని ఒక ప్రధాన వర్గం మద్దతు వల్లనే. వారే కర్ణాటక రాజకీయాలు ఎప్పటికప్పుడు పలు మలుపులు తిప్పే ‘లింగాయత్ లు’. 

 

Lingayats are kingmakers in Karnataka politics

లింగాయత్ ల ప్రాముఖ్యత

ఈ లింగాయత్ లు 1956 నుండి కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. లింగాయత్ లు హిందూ శివతత్వ జాతికి చెందిన వారు. వీరు బసవన్న స్వామిని పూజిస్తారు. సమాజంలో సమానత్వం ఉండాలనేదే వీరి సిద్ధాంతం. ఈ లింగాయత్ ఓటర్లు గతంలో కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీకి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నమ్మకస్తులుగా ఉన్నారు. వారి వర్గం నుండి వచ్చిన ఎంతో మంది కాంగ్రెస్ లీడర్లు రాజకీయంగా ఎదిగేందుకు కూడా వీరు సహకరించారు. 

Lingayats: ఇందిరాగాంధీ ఎఫెక్ట్

కర్ణాటక రాష్ట్రం 1956లో ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ కు పూర్తి మద్దతుదారులుగా మారారు. అయితే 1969లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా వైదొలిగిన తర్వాత వీరే రెండు వర్గాలుగా విడిపోయారు. ఇందిరా గాంధీని సమర్ధించేవారు ఒక కాంగ్రెస్ ఏర్పరుచుకుంటే… ఆమెను విమర్శించే వారు మరొక పార్టీగా విడిపోయారు. అయితే 1975 నుండి 77 మధ్యకాలంలో జరిగిన పరిణామాల దృష్ట్యా జనతా పార్టీ ఏర్పడింది. అప్పుడు ఇందిరాగాంధీ ను వ్యతిరేకించే కాంగ్రెస్ వారంతా జనతా పార్టీ లో కలిసిపోయారు. లింగాయత్ ప్రధాన లీడర్లు మరియు ఓటు బ్యాంకు జనతా దల్ కి అలా బాగా కలిసి వచ్చింది. 

Lingayats are kingmakers in Karnataka politics

Lingayats: పాటిల్ లో ముగింపు

1989లో కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద మెజారిటీని సాధించింది. అప్పటి ప్రధాన నాయకుడు వీరేంద్ర పాటిల్ కొలింగాయత్ ల ఓట్లను ఎంతో చాకచక్యంతో కొల్లగొట్టాడు కానీ రామజన్మభూమి సమస్య సమయంలో రథయాత్ర విషయంలో జరిగిన అల్లర్ల కారణంగా వీరేంద్ర పాటిల్ పదవి నుండి వైదొలిగాడు. అతనిని రాజీవ్ గాంధీ పదవి నుండి తప్పించగా పాటిల్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత లింగాయత్ వర్గం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం ఆపివేసింది. 

యడ్యూరప్ప హవా

ఇక 1994 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 36 సీట్లు గెలిచింది. కానీ భారతీయ జనతా పార్టీకి ఓట్ల శాతం మాత్రం 4% నుండి 17% కు భారీగా పెరిగిపోయింది. ఇలా లింగాయత్ లు బీజేపీకి మారిపోవడంతో యడ్యూరప్ప హవా కొనసాగింది. అతడిని రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఎత్తుకి తీసుకెళ్లారు. కానీ 2013లో బిజెపి… యడ్యూరప్ప పై అవినీతి ఆరోపణలు రావడంతో తో అతనిని పార్టీ నుండి తప్పించింది. 

Lingayats are kingmakers in Karnataka politics

ఇక పూర్తిగా భాజపాకే

ఇక దీని వల్ల మళ్లీ లింగాయత్ ఓటు బ్యాంకు చీలిపోవడంతో బిజెపి భారీగా నష్టపోయింది. 2008లో 110 సీట్లు సాధించిన బిజెపి 2014లో కేవలం 40 సీట్లతో సరిపెట్టుకుంది. ఇది కూడా లింగాయత్ ఓటర్ల ప్రభావమే. అయితే మళ్ళీ యడ్యూరప్ప భారతీయ జనతా పార్టీకి తిరిగి రావడంతో 2014 ఎన్నికల్లో బిజెపి 25 లోక్సభ స్థానాలకు గాను 17 స్థానాల్లో గెలిచింది. 

 

ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన బసవరాజ్ కూడా వారి మద్దతుతోనే సీఎం గా నిలిచి ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 224 సీట్లు  ఉన్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో 90 నుండి 100 స్థానాల్లో ఈ లింగాయత్ ల ఓట్ల ప్రభావంతోనే గెలుపోటములు నిర్దేశించబడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి లింగాయత్ సపోర్టు ని బసవరాజ్ బొమ్మై ఎన్నాళ్ళు కాపాడుకుంటాడు…? తర్వాత కొత్త లీడర్ అవతరిస్తే… వారు అతని వైపు మొగ్గు చూపే అవకాశం ఎంత ఉంది? అదే ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాలను నిర్దేశించే అంశం.


Share

Related posts

అన్ ఎక్స్ పెక్టెడ్: బీసీ సంక్షేమ సంఘం నుండి బాబుపై బాంబు పేలింది!

CMR

బ్రేకింగ్ : రాత్రికి రాత్రి సోము వీర్రాజు స్పీడ్ కి బ్రేకులు .. ఒక్కతొక్కు తొక్కింది ఎవరు ? 

sekhar

Lemon Lamp: మంగళ ,శుక్ర వారాలలో నిమ్మకాయ  దీపం ఎవరు పెట్టాలో తెలుసా ? అలా పెట్టడం వలన జరిగేది ఇదే!

siddhu