Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి ఏడాది మే 31 వ తారీకు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంటారు అన్న సంగతి తెలిసిందే. చేస్తున్న సినిమాకి సంబంధించి ఫోటో లేదా వీడియో రిలీజ్ చేసి అభిమానులను ప్రతి ఏడాది అలరిస్తూ ఉంటారు. గత ఏడాది లాక్ డౌన్ కారణంగా “సరిలేరు నీకెవ్వరు” సినిమా తర్వాత మహేష్ బాబు.. తర్వాత సినిమా గురించి రకరకాల వార్తలు రాగా ఆ టైంలో “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నట్లు .. సరికొత్త మేక్ఓవర్ తో టైటిల్ కార్డు రిలీజ్ చేశారు.
అయితే ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్.. స్టార్ట్ చేయడం తో సినిమాకి సంబంధించి.. ఫోటో రిలీజ్ చేస్తారా లేకపోతే చిన్నపాటి వీడియో రిలీజ్ చేస్తారా అన్న డిస్కషన్లు సోషల్ మీడియాలో అభిమానుల మధ్య జరుగుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే సినిమా యూనిట్ నుండి తాజా సమాచారం ప్రకారం సినిమాలో 30 సెకండ్ల పాటు మహేష్ బాబు కి సంబంధించిన వీడియో రిలీజ్ అవుతుందని లేటెస్ట్ ఇండస్ట్రీ వైరల్ టాక్. అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఒక బడా “బిజినెస్ మ్యాన్” పై పగ తీర్చుకునే రీతిలో ఉంటుందని.. మహేష్ బాబు తండ్రి సినిమాలో బ్యాంక్ మేనేజర్ అని సమాచారం.
Read More: KGF: ప్రభాస్ ఫాన్స్ కి పూనకాలే “కేజిఎఫ్” సినిమా తలదన్నే యాక్షన్ సన్నివేశం “సలార్” లో.. ??
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ నేపథ్యంలో దూకుడు లాగా ఉంటుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవల చెప్పుకొచ్చారు. కాగా మహేష్ అభిమానులు సినిమాకి సంబంధించి వీడియో లేదా ఫోటో ఏదైనా రిలీజ్ అయితే సోషల్ మీడియా లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయటానికి మంచి ఇంట్రెస్ట్ మీద ఉన్నారు. మరి మే 31 వ తారీకు మహేష్ సర్ ప్రైజ్ అభిమానులకు ఎలా ఉంటుందో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!