Mahesh Babu: త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకడు. అతని దర్శకత్వంలోని సినిమా చేయడానికి ఎంతో మంది కుర్ర హీరోలు, పెద్ద హీరోలు సైతం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే మహేష్ బాబు మాత్రం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించడానికి ఆలోచిస్తున్నాడు. ప్రిన్స్ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఇప్పటికే అతడు, ఖలేజా అనే రెండు సినిమాలో నటించాడు. అయితే ఖలేజా సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో త్రివిక్రమ్ తో మరో సినిమా అంటేనే మహేష్ బాబుకి వణుకు వచ్చేస్తోంది.
త్రివిక్రమ్ ఖలేజా తర్వాత అల్లు అర్జున్‌తో కలిసి ‘జులాయి’ సినిమాని తెరకెక్కించగా అది సూపర్ హిట్ అయింది. తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘అత్తారింటికి దారేది’ తీయగా అది బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఆ తర్వాత అజ్ఞాతవాసి సినిమాతో మళ్లీ పరాజయం పాలయ్యాడు త్రివిక్రమ్. అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అరవింద సమేత మూవీతో మళ్లీ నిలదొక్కుకున్నాడు. ఈ సినిమా తర్వాత బన్నీతో కలిసి అల వైకుంఠపురములో మూవీ తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా బన్నీ లైఫ్‌లోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయినా కూడా త్రివిక్రమ్ ప్రతిభపై మహేష్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి సినిమా చేయాలని అనుకున్నాడు కానీ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టాడు. దీంతో మహేష్ బాబుతో మూవీ చేయదలిచాడు త్రివిక్రమ్. మహేష్ అమెరికాలో వున్నపుడు ఒక స్క్రిప్ట్ గురించి చెప్పాడు. ఆ తరువాత దుబాయ్ లో ఉన్నపుడు కూడా అదే స్క్రిప్ట్ గురించి చర్చలు జరిపాడు. కానీ ప్రిన్స్ మాత్రం ఓకే చెప్పలేదు. దీంతో తాజాగా అమెరికా నుంచి తిరిగొచ్చిన మహేష్ కి త్రివిక్రమ్ మళ్లీ స్క్రిప్ట్ వినిపించాడు. అప్పటికిగానీ మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఖలేజా దారుణంగా ఫెయిల్ అవ్వడంతో మహేష్ మళ్లీ అతనితో కలిసి మూవీ తీసేందుకు భయపడిపోతున్నాడు. ముఖ్యంగా బ్రహ్మోత్సవం ప్లాప్ తర్వాత స్క్రిప్ట్ పూర్తిగా విన్న తర్వాతే తన నిర్ణయాన్ని చెబుతున్నాడు. ఇక త్రివిక్రమ్ తో చేదు అనుభవం ఉంది కాబట్టే అతని చేత నాలుగైదుసార్లు స్క్రిప్ట్ వినిపించుకుని.. ఫైనల్ స్క్రిప్ట్ విన్న తర్వాతనే ఓకే చెప్పాడు. మహేష్ స్క్రిప్ట్ సెలక్షన్ తీరు గురించి తెలుసుకున్న అభిమానులు ఫిదా అవుతున్నారు. మంచిగా లేని సినిమా తీస్తే ప్రేక్షకులతో పాటు మూవీ యూనిట్ కూడా నష్టమే మిగులుతుందని.. కానీ ఆ నష్టం రాకుండా మహేష్ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మెచ్చుకోదగిన విషయం ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…
ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…