స్టార్ మా ఛానల్ లో అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 అత్యధిక టీ ఆర్ పి రేటింగ్స్ ను సొంతం చేసుకుంది. ఈ రియాలిటీ షో దాదాపు 105 రోజులపాటు కొనసాగింది. ఈ సీజన్ లో అభిజిత్ దుద్దాల విన్నర్ గా మరియు అఖిల్ సార్థక్ రన్నర్ అప్ గా నిలిచారు.
ఈ సీజన్ లో స్ట్రాంగ్ ఫిమేల్ కంటెస్టెంట్స్ గా మోనాల్ గజ్జర్ మరియు అరియనా నిలిచారు. ఈ ఇద్దరికి బిగ్ బాస్ హౌస్ లో నుంచి వచ్చాక మంచి ప్రేక్షకాదరణ తోపాటు హౌస్ లో ఉన్నప్పుడు కూడా ఏ వారానికి ఆ వారం బాగా ఓట్లు దక్కించుకున్నారు. ఈ ముద్దుగుమ్మలు ఇద్దరు హౌస్ నుంచి బయటకి వచ్చాక సోషల్ మీడియా మాద్యమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ మంచి క్రేజ్ తో దూసుకెళుతున్నారు.
ఇక అసలు విషయం ఏమిటంటే ఇటీవల పలువురు సినిమా నిర్మాతలు, దర్శకులు అటు మోనాల్ గజ్జర్ తో పాటుగా ఇటు ఆరియానా కి కూడా తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం మోనాల్ కి మొత్తం నాలుగు సినిమాల్లో నటించే ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. అలానే మూడు సినిమాల్లో అరియానా కి ఛాన్స్ లు లభించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ప్రస్తుతం మోనాల్ అల్లు అల్లుడు అదుర్స్ మూవీ లో ప్రత్యేక సాంగ్ లో నటిస్తుంది. ఈ పాటకు గాను ఆమె రూ. 15 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మరోవైపు అరియనా కి కూడా చాలా మంచి పాత్రలు లభించినట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరికీ వరుసగా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఈ ముద్దుగుమ్మలు తమకు ప్రేక్షకుల్లో ఉన్న పాపులారిటీ తో ఆ ఛాన్సులను సద్వినియోగం చేసుకుంటారో లేదో చూడాలి.