అందరి బయోపిక్‌లను, వివాదస్పద చిత్రాలను తెరకెక్కిస్తున్న వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ బయోపిక్ రూపొందనుంది. `కమ్మరాజ్యంలో కడపరెడ్లు` సినిమా సమయంలో రేగిన వివాదంలో ఆర్జీవీతో గొడవ పడ్డ రైటర్ జొన్న విత్తుల తాను ఆర్జీవీ బయోపిక్‌ని చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జొన్నవిత్తుల అన్నంత పనీ చేస్తున్నారు. ఆర్జీవీ బయోపిక్‌కి సంబంధించి పనులను మొదలు పెట్టేశానని ఆయన తెలిపారు. రామ్‌గోపాల్ పోలికలతో ఉన్న మధ్య ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి ఈ బయోపిక్‌లో నటించబోతున్నాడట. ఆర్జీవీకి సంబంధించిన సినిమాలు, ఆయన వితండవాదం అన్నీ ఈ సినిమాలో ఉంటాయని సమాచారం. మరి ఈ బయోపిక్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.
Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!