Aadhi-Nikki: ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ హీరోయిన్ నిక్కీ గల్రానీతో కొన్నాళ్ల నుంచీ ప్రేమాయణం నడిపిస్తున్న ఆది.. ఇటీవలె ఆమెతో నిరాడంబరంగా నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరి ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
అయితే ఇప్పుడు ఈ జంట మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుడు పెట్టేందుకు రెడీ అయ్యారు. మరో పది రోజుల్లోనే వీరి పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఆది-నిక్కీల వివాహం మే 18న జరగబోతోంది. ఇందుకు చెన్నైలోని ఓ స్టార్ హోటల్ వేదికగా కాబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కుటుంబసభ్యులు, దగ్గర బంధువులు మాత్రమే వీరి పెళ్లికి హాజరు కానున్నారట. ఆ తర్వాత భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేసి.. టాలీవుడు, కోలీవుడ్ సినీ ప్రిముకులను ఆహ్వానించనున్నారని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా, `యాగవరాయినుం నా కాక్క` అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన తొలిసారి నిక్కీ నటించింది.
ఈ చిత్రం తెలుగులో ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఈ మూవీ చేస్తున్నప్పుడే నిక్కీకి, ఆదితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి `మరకతమణి` మూవీలో నటించారు. అప్పుడు వీరి పరిచయం ప్రేమకు దారి తీసింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి. ఆది ఇంట్లో జరిగే ఈవెంట్లు, ఫంక్షన్లలో నిక్కీ గల్రానీ దర్శనమిస్తూ ఉండటంతో ఆ వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఇక చివరకు ఈ జం ఆ వార్తలనే నిజం చేస్తూ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!