బాలీవుడ్ స్టార్ ఖాన్ త్రయంలో ఒకరైన ఆమిర్‌ఖాన్ ఇప్పుడు లాల్‌సింగ్ చద్దా చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఈయన కుమార్తె ఐరా ఖాన్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈమెకు దర్శకత్వం చేయడానికి కూడా చాలా ఆసక్తి ఉంది. అందులో భాగంగా త్వరలోనే ఈమె మెగాఫోన్ పట్టనుంది. అయితే సినిమా కాదు.. ఈమె నాటకాన్ని డైరెక్ట్ చేయబోతుంది. ఇప్పటికే తన డైరెక్షన్‌కు సంబంధించిన పనులను స్టార్ట్ చేసిసింది. ఈ ఏడాది చివర్లో ఐరా ఖాన్ డైరెక్షన్ షురూ చేయనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
previous post
next post