Allu Arjun: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు వంద కోట్లకు పైగానే ఈ సినిమా కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అక్కడి హీరోలకు పోటీగా బన్నీ మొదటి చిత్రం “పుష్ప” మంచి పోటీ ఇచ్చిందని.. బన్నీకి హిందీ లో తిరుగులేని మార్కెట్ ఉందని రుజువు చేసినట్లు చెప్పుకొస్తున్నారు. దీంతో బన్నీ “పుష్ప” సక్సెస్ నీ బాగా ఎంజాయ్ చేయడం జరిగింది.
ఇటీవలే కుటుంబ సమేతంగా దుబాయ్ కూడా వెళ్లారు. అయితే తాజాగా ఇటీవల దుబాయ్ ట్రిప్పు ముగించుకుని ఇండియాలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ తన పూర్తి టైం లో ఎక్కువగా కూతురు అర్హతో గడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అర్హ చిన్న వయసులోనే సినిమా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత మెయిన్ రోల్ లో వస్తున్న శాకుంతలం సినిమాలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఈ తరుణంలో అర్హ కోసం ఈ సినిమా షూటింగ్ స్పాట్ లోకి బన్నీ వెళ్లనున్నట్లు టాక్. డైరెక్టర్ గుణశేఖర్ తో మంచి సంబంధం ఉండటం తో ..బన్నీ తన కూతురు సినిమా షూటింగ్ స్పాట్ లో తాజాగా గడపడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా తన ప్రత్యేకమైన కెరవాన్ కూడా షూటింగ్ స్పాట్ లో కి తీసుకెళ్లడానికి రెడీ అయినట్లు ఫిల్మ్ నగర్ టాక్. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో బన్నీ నిజంగా బంగారంరా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప మొదటి భాగంలో గంధపు చెక్కల స్మగ్లర్ చేయగా.. “పుష్ప” సెకండ్ పార్ట్ లో సిండికేట్ నీ కంట్రోల్ చేసే కింగ్ మేకర్ గా అల్లు అర్జున్ ని సుకుమార్ సరికొత్తగా చూపించనున్నట్లు సమాచారం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!