Ananya Nagalla: అనన్య నాగళ్ల.. ఈ కుర్ర భామ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. 2019లో వచ్చిన `మల్లేశం` సినిమాలో ప్రియదర్శికు జోడీగా నటించి.. తెలుగు ఇండస్ట్రలోకి అడుగు పెట్టిందీ బ్యూటీ. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రమైన `వకీల్ సాబ్`లో అవకాశం కొట్టేసింది.
ఇందులో దివ్య నాయక్ అనే పల్లెటూరి అమ్మాయిగా తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను మిస్మరైజ్ చేసిన అనన్య.. ఆ వెంటనే `ప్లే బ్యాక్` అనే మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే అందం, అభినయం, మంచి టాలెంట్ ఉన్నా.. అనన్యకు పెద్దగా ఆఫర్లు మాత్రం రావడం లేదు.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తూ అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా కూడా పసుపు రంగు చీరను ధరించి ఒంపుసొంపులు పోతూ హాట్ హాట్‌గా ఫొటోలకు పోజులిచ్చింది.
ఆపై ఇందుకు సంబంధించిన పిక్స్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయగా.. అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూస్తే ఎవ్వరికైనా చూపు తిప్పుకోవడం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అంత అందంగా అనన్య ఆకట్టుకుంటోంది.
మొత్తానికి ఈ యంగ్ బ్యూటీ మరోసారి తన అందాలతో నెటిజన్లు ఫుల్ మీల్స్ పెట్టేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం అనన్య నాగళ్ల లేటెస్ట్ పిక్స్‌ను మీరు ఓ చూపు చూసేయండి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!