Salaar Trailer: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “సలార్” మొదటి పార్ట్ డిసెంబర్ 22వ తారీకు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్ మొదటి తారీకు “సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్” ట్రైలర్ విడుదల కావడం జరిగింది. ట్రైలర్ లో ప్రభాస్ చాలా తక్కువ సేపు కనిపించడం జరిగింది. 3 నిమిషాల 41 సెకండ్ల నిడివి కలిగిన.. ఈ ట్రైలర్ లో . దాదాపు రెండు నిమిషాల పాటు సినిమా కథకి సంబంధించిన ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రభాస్ నీ చూపించారు. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో “సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్” ట్రైలర్ తెరకెక్కటం జరిగింది.
ప్రభాస్ మరియు మలయాళ నటుడు.. పృధ్వీరాజ్ సుకుమారన్..ఈ సినిమాలో ప్రాణ స్నేహితులగా నటిస్తున్నారు. నిన్న విడుదల చేసిన ట్రైలర్ ఐదు భాషలలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. అంతేకాదు పలు రికార్డులు బ్రేక్ చేయడం జరిగింది. “RRR” మూవీ రికార్డులు కూడా “సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్” బ్రేక్ చేసింది. అయితే ట్రైలర్ లో ప్రభాస్ కనిపించింది కాస్త తక్కువ ఉందన్న నిరాశ అభిమానులలో వినిపిస్తుంది. దీంతో అభిమానుల దాహం తీర్చడానికి మేకర్స్ “సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్” రెండో ట్రైలర్.. విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. సరిగ్గా విడుదలయ్యే సమయానికి రెండో ట్రైలర్ కి మధ్య వారం గ్యాప్ లో… రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. “సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్” ఫస్ట్ ట్రైలర్ లో కథతో పాటు సినిమాలో వైలెన్స్ గట్టిగా ఉందని చాలా హైలెట్ గా చూపించారు.
స్నేహితుడి కోసం ఎరైనా అవుతా సొరైనా… అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ట్రైలర్ లో చాలా హైలెట్ అయింది. యాక్షన్ సన్నివేశాలలో.. ప్రభాస్ రక్తపాతం సృష్టించినట్లు అర్థమవుతుంది. అయితే సగానికి పైగానే విడుదలైన ట్రైలర్ లో కథతో పాటు మిగతా పాత్రలు ఉండటంతో అభిమానులు కొద్దిగా నిరాశ చెందడంతో రెండో ట్రైలర్ లో పూర్తిగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ చూపించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. డిసెంబర్ 22వ తేదీన సినిమా విడుదల అవుతుండగా డిసెంబర్ 14 లేదా 15వ తారీకు “సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్” రెండో ట్రైలర్.. రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.