Pushpa 2: దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా “పుష్ప 2” సినిమా కోసం ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. 2021 వ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలైన పుష్ప ఊహించని విజయం సాధించింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ గ్రాఫ్ ప్రపంచ స్థాయిలో ఒక్కసారిగా పెరిగింది. దర్శకుడు సుకుమార్ మరియు నిర్మాతలు కనివిని ఎరుగని రీతిలో ఈ విజయాన్ని ఆస్వాదించారు. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో సుక్కు మరియు బన్నీ కలిసి చేసిన ఈ సినిమా.. అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన ప్రమోషన్స్ చేయకపోయినా గాని భారీగా కలెక్షన్స్ సాధించడం జరిగింది. ముఖ్యంగా పుష్ప సినిమాలో డైలాగులు మరియు పాటలు అన్నీ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అల్లు అర్జున్ మేనరిజం ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైరల్ అయింది. ముఖ్యంగా తగ్గేదెలా డైలాగ్.. ప్రపంచంలో మారుమ్రోగింది. దీంతో ఇప్పుడు “పుష్ప 2” కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎలా ఉంటే తాజాగా ఈ సినిమాలో కొత్త డైలాగ్ ని అల్లు అర్జున్ ఇటీవల “బేబీ” సినిమా యూనిట్ అభినందన కార్యక్రమంలో బన్నీ పలకడం జరిగింది. ఇటీవల బేబీ సినిమాని బన్నీ చూడటం జరిగింది. సినిమా అద్భుతంగా ఉండటంతో సినిమా యూనిట్ మొత్తాన్ని అభినందించారు. ముఖ్యంగా హీరోయిన్ వైష్ణవికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని కోరుకుంటున్నట్లు తెలుగు అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీకి మరింత మంది రావాలని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇక ఇదే సమయంలో “పుష్ప 2″ గురించి బిగ్గెస్ట్ లీక్ ఇవ్వటం జరిగింది. పుష్పాలు తగ్గేదేలే డైలాగ్.. లెవెల్ లో రెండో భాగంలో కూడా ఉంటుందని సినిమా మొత్తం ఒకదాని పైన ఆధారపడి ఉంటుందని చెబుతూ..”ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద.. జరుగుతా ఉండది… పుష్ప రూల్” అంటూ బన్నీ డైలాగ్ చెప్పడం జరిగింది. కాగా పుష్ప మొదటి భాగం కంటే మరిన్ని ఎక్కువ భాషలలో పుష్ప సెకండ్ పార్ట్ రిలీజ్ చేయబోతున్నారట. అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈసారి ఎక్కువగా ప్రమోషన్స్ చేయాలని మేకర్స్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు అంట. పుష్ప మొదటి భాగం హిందీలో ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. అయినా అక్కడ 100 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. దీంతో ఈసారి ప్రమోషన్స్ కి ఎక్కువ టైం కేటాయించాలని పుష్ప మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!