మెగాస్టార్ చిరంజీవి తొలిసారి విద్యారంగంలోకి అడుగు పెడుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. శ్రీకాకుళంలో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేరుతో చిరంజీవి ఫౌండర్‌గా.. నాగబాబు గౌరవ చైర్మన్‌గా.. రామ్‌చరణ్ ప్రెసిడెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. అయితే, శ్రీకాకుళంలోని సదరు ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం స్పందించింది. తమ పాఠశాలకు, చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. దీంతో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్టయ్యింది.
previous post
next post