ఈమధ్య మెగాస్టార్ చిరంజీవి కేరళకు టూర్ వెళ్లాడు. అసలు చిరు కేరళకు ఎందుకు వెళ్లాడని అందరూ అనుకున్నారు. అయితే అసలు కారణం ఏమిటంటే.. మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమాకు సంబంధించిన వర్కవుట్స్ మొదలు పెట్టాడు. సైరా సినిమా కోసం బరువు పెరిగిన చిరంజీవి, చిరంజీవి స్లిమ్‌గా కనపడాలని కొరటాల సూచించాడట. దీంతో చిరంజీవి కేరళకు వెళ్లి అక్కడ బరువు తగ్గే ట్రీట్మెంట్ తీసుకున్నాడట. ఈ సినిమాను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న ప్రారంభిస్తారట. రెగ్యులర్ షూటింగ్‌ను నవంబర్ నుండి స్టార్ట్ చేస్తారట. మరోపక్క చిరు తన `సైరా నరసింహారెడ్డి` సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహరాల్లోనూ బిజీగా ఉన్నారు.
previous post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!