వెండితెరపై వంటలక్క పేరు ఒక బ్రాండ్ లా మారింది. సినిమా హీరోయిన్లతో పాటుగా క్రేజ్ ను సంపాధించుకుని అభిమానుల మనస్సును దోచుకుందీ ఈ బ్యూటీ. భాషతో సంబంధం లేకుండా భావాలను పండించడంలో హీరోయిన్లను మించిపోయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.. స్టార్ మా టీవీ అంటే చాలు జనాలందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క సీరిల్ కార్తీక దీపం.
ఆ సీరియల్ చూసేది మటుకు కేవలం వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ క్యారెక్టర్ కు ఫిదా అయ్యే చూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సీరియల్ దేశవ్యాప్తంగా అంత ఫేమస్ అయిందంటే అది కేవలం వంటలక్క పర్ఫామెన్స్ అనే చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా వంటలక్క ఎంత క్రేజీగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.. ఈ సీరియల్ రేటింగ్ కూడా అన్నింటి కంటే టాప్ లో ఉండటం విశేషం.
కాగా ఈ మధ్య ఈ సీరియల్ ఎపిసోడ్స్ చూస్తుంటే కథ ముగింపుకు వచ్చిందనే అర్థమవుతోంది. ఈ సీరియల్ చూసిన ఆడియెన్స్ కు మాత్రం విసుగు వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎప్పుడో ఏండ్ల కిందట విడిపోయిన జంట ఇంకా కలవకపోవడం ఏంటనే విసుగు చెందినట్టున్నారు. కాగా ఈ సీరియల్ ను ఎంతగా సాగదీసి నడిపిస్తున్నా ఈ సీరియల్ ను చూడటం మాత్రం మానడం లేదు దీప అభిమానులు. కాగా ఈ సీరియల్ హీరోయిన్ కు సినిమా చాన్స్ లు రావడంతో వాటి వైపు మళ్లే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ ఏడాదికి వంటలక్క సీరియల్ కు ముగింపు కార్డు పడితే మరి ఆడియెన్స్ పరిస్థితి ఏంటనుకుంటున్నారా.. దానికి స్టార్ మా ప్రీ ప్లాన్డ్ గానే ఉందని అర్థమవుతోంది. తన ప్రేక్షకులను పోగొట్టుకోకుండా, తన చానల్ రేట్ పడిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు ఆలోచిస్తుందేమో ఎవరికి తెలుసు. అందుకే కదా.. వదినమ్మ సీరియల్ లో ట్విస్ట్ ల మీద ట్విస్టులిస్తూ పైకి లేపుతోంది. ఇదిలా ఉంటే ఇంటింటి గృహ లక్ష్మి కస్తూరి పాత్రను కూడా ఓ రేంజ్ పైకి లేపుతున్నారు. వంటలక్క శుభం చెబితే వదినమ్మ క్యారెక్టర్ నో, ఇంటింటి గృహలక్ష్మి క్యారెక్టర్ నో హైలెట్ చేసి ఆమె స్థానాన్ని భర్తీ చేసే దిశగా మా టీ వీ ఆలోచిస్తుందని అర్థమవుతోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!