Naga Chaitanya: విడాకుల అనంతరం చైతు, సామ్ ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. చైతు సంగతి దేవుడెరుగు కానీ సమంత మాత్రం మంచి స్పీడుతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇది నిజమో అబద్ధమో తెలియదు గాని ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో చెక్కర్లు కొడుతోంది. గత సంవత్సరం అక్టోబర్ 2న చైతు, సమంత అధికారికంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం సమంత కాస్త డిప్రెషన్లోకి వెళ్లినట్టు అనిపించినా, తరువాత పుంజుకొని కెరీర్ పైన పూర్తి దృష్టి సారించింది. చైతు కూడా రకరకాల ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్నాడు. కాగా ఇపుడు చైతు గురించి ఓ వార్త బయటకు వచ్చింది.
Naga Chaitanya: చైతు మరో పెళ్లి తంతు?
చైతు బాలీవుడ్లో అమీర్‌ఖాన్‌తో కలిసి ‘లాల్చద్దా’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసినదే. సమంత కూడా బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్లో కూడా ఛాన్సులు కొట్టేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు చైతుకు సెకండ్ మ్యారేజ్ చేసేందుకు నాగార్జున రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో అఖిల్ – చైతు మ్యారేజ్‌లను ఒకేసారి చేసేయాలని నాగ్ అనుకున్నాడు. కానీ కొన్ని అనూహ్య కారణాల వలన అప్పుడు అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అలాగే చైతు పెళ్లి కూడా పెటాకులు అయింది. అఖిల్ మాట పక్కన పెడితే, చైతు మేటర్ సెటిల్ చేద్దామని నాగ్ అనుకున్నట్టు సమాచారం.
పెళ్లి కుమార్తె ఎవరు?
విజయవాడకు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్తల కుటుంబానికి చెందిన యువతితో చైతు సెకండ్ మ్యారేజ్ ఫిక్స్ చేసే ఆలోచనలో నాగ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ యువతి అమెరికాలో MBA పూర్తి చేసిందట. ఈ సారి నాగార్జున తన సొంత సామాజిక వర్గమైన కమ్మ వర్గానికి చెందిన సంప్రదాయ కుటుంబంతోనే వియ్యం అందుకోబోతున్నాడని భోగట్టా. ఏదేమైనా చైతు ఎంతో ఇష్టపడ్డ తొలి మ్యారేజ్ లైఫ్ అనుకున్నట్టుగా సక్సెస్ కాలేదు. ఇక రెండో మ్యారేజ్ అయినా చైతు వైవాహిక బంధం 3 పువ్వులు, 6 కాయలుగా కొనసాగాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!