NewsOrbit
Entertainment News సినిమా

SIIMA 2022: సాయి పల్లవికి ఇవ్వాల్సిన అవార్డు పూజా హెగ్డేకి ఇచ్చారా..? సైమా అవార్డు ప్రకటనపై సీరియస్ వ్యాఖ్యలు..!!

SIIMA 2022: దక్షిణాది సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు “సైమా”. ఈ క్రమంలో సైమా అవార్డుల పురస్కారం 10 సంవత్సరాలు కావస్తున్న క్రమంలో సెప్టెంబర్ 10 మరియు 11వ తారీకులలో బెంగళూరు నగరం నందు చాలా గ్రాండ్ గా నిర్వహించారు. అల్లు అర్జున్ నటించిన “పుష్ప” సినిమాకి భారీ ఎత్తున అవార్డులు వచ్చాయి. ఇదిలా ఉంటే బెస్ట్ హీరోయిన్ అవార్డు “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి గాను పూజ హెగ్డే కి సైమా అవార్డు ఇవ్వటంపై విమర్శలు వస్తున్నాయి.” 2021 వ సంవత్సరంలో.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా రావడం జరిగింది. సరిగ్గా అదే ఏడాది సాయి పల్లవి నటించిన “శ్యామ్ సింగరాయ్”, “లవ్ స్టోరీ” వంటి రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలకు జనాల నుండి సినీ క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకటి రొమాంటిక్ స్టోరీ అయితే మరొకటి క్లాసికల్ కథాంశం కలిగిన సినిమా. రెండింటిలో కూడా హీరోయిన్ పాత్రకు మంచి డిమాండ్ ఉంది.

Has Pooja Hegde been given the award that should have been given to Sai Pallavi
SIIMA 2022

ఈ రెండు సినిమాలతో పోలిస్తే పూజా హెగ్డే నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” లో ఆమె చేసిన పాత్రకి నటనకి కూడా పెద్దగా ఆస్కారం లేదని జనాల టాక్. పూజా హెగ్డే గ్లామర్ పరంగా ఎక్స్పోజింగ్ పరంగా ట్రెండింగ్ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ ఉంది. కానీ సాయి పల్లవి తీరు వేరు. ప్రస్తుత హీరోయిన్ లకు చాలా వ్యతిరేకంగా సినిమా సెలెక్షన్ చేసుకుంటూ ఉంది. హీరోయిన్ ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ.. మేల్ డామినేట్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. నటన పరంగా, డాన్స్ పరంగా అయినా అన్ని రకాలుగా చూసుకుంటే.. సాయి పల్లవి దరిదాపుల్లో కూడా పూజా హెగ్డే ఉండదు.  అటువంటిది పూజా హెగ్డేకి “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమాకి గాను బెస్ట్ హీరోయిన్ అవార్డు ఇవ్వటం ఏంటి అని.. జనాలు ప్రశ్నిస్తున్నారు. ఎవరో లాబీయింగ్ మేరకు ఆమెకు సైమా అవార్డు వచ్చింది అని ఆరోపణలు చేస్తున్నారు.

Has Pooja Hegde been given the award that should have been given to Sai Pallavi
SIIMA 2022

“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” వచ్చిన ఏడాదిలోనే సాయి పల్లవి నటించిన “లవ్ స్టోరీ” వచ్చింది. ఈ సినిమాలో.. సాయి పల్లవి నటన ఇంక “సారంగా దరియా” సాంగులో వేసిన స్టెప్పులు సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఆఖరికి “లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా వచ్చిన చిరంజీవి సైతం.. సాయి పల్లవి నటన, డ్యాన్స్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆమె ఒప్పుకుంటే సినిమా చేయాలనీ..ఆమెతో డాన్స్ చేయాలనీ ఉందని స్టేజి మీద అందరు చూస్తుండగాన్నే చిరంజీవి మాట్లాడటం అప్పట్లో సంచలనం రేపింది.  ఇంకా “శ్యాం సింగరాయ్” లో కూడా సాయి పల్లవి నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. 2021లో దక్షిణాది సినిమా రంగంలో హీరోయిన్ లలో సాయి పల్లవి పేరు మారుమ్రోగింది. అంతేకాదు “లేడీ పవర్ స్టార్” అనే టైటిల్ ట్యాగ్ కూడా సొంతం చేసుకుంది. అటువంటి సాయి పల్లవికి బెస్ట్ హీరోయిన్ అవార్డు ఇవ్వకుండా.. నటనకు ఆస్కారం లేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమాలో పూజా హెగ్డే పాత్రకి అవార్డు ప్రకటించడం పట్ల సినీ ప్రేమికులు సీరియస్ అవుతున్నారు.

 

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N