NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri February 21 2024 Episode 159: మినిస్టర్ గారి కేసులో ప్రియా ని పట్టుకున్న జగదాత్రి కేదార్..

Jagadhatri Today Episode February 21 2024 Episode 159 Highlights

Jagadhatri February 21 2024 Episode 159: చూస్తుంటే తెలిసిన వాళ్ళ లాగా ఉన్నారు మీ పేరు ఏంటి అని యువరాజ్ వాళ్ళని అడుగుతాడు. జగదాత్రి హిందీలో వెళ్దాం పద అంటూ వెళ్ళిపోతుంది. నన్ను చూసి పారిపోతున్నారు ఎవరు వీళ్లు అని యువరాజ్ వాళ్ళ వెనకాల ఫాలో అవుతాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 21 2024 Episode 159 Highlights
Jagadhatri Today Episode February 21 2024 Episode 159 Highlights

జగదాత్రి కేదార్ మినిస్టర్ గారి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తారు. ఎవరు మీరు అని వాచ్మెన్ అడుగుతాడు. పోలీస్ అని కేదార్ అంటాడు. మినిస్టర్ గారు ఇక్కడికి నెలలో ఎన్ని సార్లు వస్తారు అని జగదాత్రి అడుగుతుంది. అవన్నీ నీకెందుకు మేడం అని వాచ్మెన్ అంటాడు. మీరు చెప్పే ఆధారం మా ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు మీకు ఎటువంటి భయం లేదు చెప్పండి అని జగదాత్రి అంటుంది. ఆయన పార్టీ కార్యకర్తలతో వారానికి ఒకసారి వచ్చి వెళుతూ ఉండేవారు మేడం అని వాచ్మెన్ చెబుతాడు. ఎవరైనా ఆడవాళ్లు వచ్చి వెళుతూ ఉండేవారా అని ప్రియ ఫోటో చూపెడుతుంది జగదాత్రి. ప్రియా మేడం మాకెందుకు తెలవదు  అని వాచ్మెన్ భార్య అంటుంది. ఇంతలో ప్రియ వాచ్మెన్ కి ఫోన్ చేసి ఎవరైనా వస్తే చెప్పొద్దని చెప్పడానికి ఫోన్ చేస్తుంది కానీ వాచ్మెన్ ఫోన్ ఎత్తడు. ఏం పర్వాలేదు చెప్పండి అని కేదార్ అంటాడు.

Jagadhatri Today Episode February 21 2024 Episode 159 Highlights
Jagadhatri Today Episode February 21 2024 Episode 159 Highlights

ప్రియతో వారానికి రెండు మూడు సార్లు వచ్చేవారు మేడం వచ్చినప్పుడు రెండు రోజులు ఉండి వెళ్ళిపోయేవారు అప్పుడు మమ్మల్ని తప్ప ఇక్కడ ఎవరిని ఉంచేవారు కాదు అని వాచ్మెన్ చెబుతాడు. ఇంతలో ప్రియ మళ్ళీ ఫోన్ చేస్తుంది. ప్రియమ్మ ఫోన్ చేస్తుంది అని వాచ్మెన్ వాళ్ళ భార్య అంటుంది. ఎత్తి స్పీకర్ పెట్టండి అని జగదాత్రి అంటుంది. వాచ్మెన్ ఫోన్ ఎత్తి స్పీకర్ పెట్టి మాట్లాడుతాడు. ఇడియట్ ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు ఏంటి నాకోసం ఎవరైనా వచ్చి అడిగితే నా గురించి ఏమీ చెప్పకండి అసలు నేనెవరో తెలియదని చెప్పండి అని ప్రియ అంటుంది. అలా ఎందుకు చెప్పాలి మేడం అని వాచ్మెన్ అంటాడు.  ఉద్యోగం కావాలా సమాధానం కావాలా అని ప్రియ అడుగుతుంది. నాకు ఉద్యోగమే కావాలి మేడం అని వాచ్మెన్ అంటాడు. వెంటనే జగదాత్రి ఆ ఫోన్ లాక్కొని హలో ప్రియ అని అంటుంది. ఎవరు మీరు అని ప్రియ అంటుంది. అప్పుడే మర్చిపోయావా మీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడను కదా ప్రియ అని జగదాత్రి అనే లోపే ప్రియ ఫోన్ కట్ చేస్తుంది. ఏమైంది ప్రియ కంగారు పడుతున్నావ్ అని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటాడు.పోలీసులకు నిజం తెలిసిపోయింది మనం వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి అని ప్రియ సామాన్లు అన్ని సర్దుకొని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని తిసుకొని ఎయిర్ పోర్ట్ కి బయలుదేరుతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 21 2024 Episode 159 Highlights
Jagadhatri Today Episode February 21 2024 Episode 159 Highlights

కేదార్ నిజం తెలిసిందని ప్రియ పారిపోతుంది వెంటనే తనని పట్టుకోవాలి పదా అని జగదాత్రి కేదార్ బయలుదేరుతారు. అక్కడే కేదార్ వాళ్ళని గమనిస్తున్న యువరాజ్ తన టీ షర్టుకి ఒక స్టిక్కర్ అతికించి పారిపోతాడు. రేయ్ ఎవర్రా నువ్వు అని కేదార్ అంటాడు. కేదార్ టైం లేదు ప్రియ వాళ్ళు పారిపోతారు కదా అని జగదాత్రి అంటుంది. కేదార్ ఈ స్టిక్కర్ తో నువ్వు ఇంటికి వచ్చావు అంటే ఆ ఇద్దరే మీరు అని తేలిపోతుంది అని యువరాజ్ అనుకుంటాడు. ప్రియ వాళ్ళు మనకి నిజం తెలిసిపోయిందని ఇంట్లో ఉండరు కేదార్ వాళ్లు సిటీ వదిలి పారిపోవాలనుకుంటారు ఎటు వెళ్లాలనుకుంటారు అని జగదాత్రి ఆలోచిస్తుంది. ప్రియకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కేదార్ తనని తీసుకొని ఫారెన్ వెళ్ళిపోవాలనుకుంటుంది పద వాళ్లు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాలి అంటే రింగ్ రోడ్ నుంచి వెళ్లాలి కదా అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 21 2024 Episode 159 Highlights
Jagadhatri Today Episode February 21 2024 Episode 159 Highlights

ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ ప్రియ అని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటాడు. వాళ్లు చాలా డేంజర్ గా ఉన్నారు వాళ్లు మనల్ని ఎలాగైనా పట్టుకుంటారు అని ప్రియ టెన్షన్ పడుతుంది.  మనం బొంబాయి వెళ్లి అక్కడి నుంచి చెన్నై వెళ్తున్నామని వాళ్లకి ఏం తెలుసు తెలుసుకోవడానికి రెండు రోజులు టైం పడుతుంది టెన్షన్ పడకు అని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటాడు. ఇంతలో జగదాత్రి  ప్రియ కారుకి అడ్డంగా కారు పెడుతుంది. ఏమైంది ప్రియ కార్ ఎందుకు ఆపావు అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. చెప్పాను కదా వాళ్లు చాలా డేంజరస్ అని పోలీసులు వచ్చారు చూడు అని ప్రియ అంటుంది. వాళ్ల సంగతి నేను చూసుకుంటాను ఉండు అని వాళ్ళ ఫ్రెండ్ కారు దిగి జగదాత్రి వాళ్ళ దగ్గరికి వస్తాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 21 2024 Episode 159 Highlights
Jagadhatri Today Episode February 21 2024 Episode 159 Highlights

ఇంకా పాతకాలంగా ఎందుకు ఆలోచిస్తావు ప్రియ అని జగదాత్రి అంటుంది.  నీ సంగతి మా వాళ్లకు చెప్తాను అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. అర్థమైంది నువ్వు ఇద్దరు రౌడీల్ని పంపిస్తావు ఆ రౌడీలని మా కేదార్ చిత్తు కొడతాడు అదే జరుగుతుంది ఇంకా ఈ సినిమా డైలాగులు ఏంటి బ్రో  కొత్తగా ఆలోచించండి అని జగదాత్రి అంటుంది. అయితే మీకు ఎంత కావాలో చెప్పండి నిజాయితీకి ఒక రేటు ఉంటుంది కదా అని అతను అంటాడు.ఎంత ఇస్తావ్  ఏంటి అని కేదార్ అంటాడు. మా వాళ్ళు ఇస్తారు తీసుకోండి అని అతను అనగానే రౌడీలు కేదార్ జగదాత్రి మీద పడి కొట్టబోతారు. వెంటనే కేదార్ జగదాత్రి వాళ్ళని చిత్తుచిత్తుగా కొట్టి ప్రియకు గన్ను గురిపెడుతుంది జగదాత్రి.చెప్పు ప్రియ ఇక్కడ కాబట్టి నిలబెట్టి మాట్లాడుతున్నాను అదే స్టేషన్లో అయితే ఆడదానివి అని కూడా మర్చిపోయి కొట్టి నిజం కక్కిస్తాను అని జగదాత్రి అంటుంది. మినిస్టర్ గారు చచ్చిపోయారు నేను ఆయన గెస్ట్ హౌస్ లో ఉన్నాను ఆయన మందు తాగుతూ ఉన్నాడు నేను చికెన్ ఫ్రై చేసుకొని వచ్చి అక్కడ పెట్టాను. ఏంటి డార్లింగ్ డల్ గా ఉన్నావ్ అని మినిస్టర్ గారు అంటారు. నామీద ఇప్పుడు చూపించే ప్రేమ వేరొకరి మీద చూపించవు అని గ్యారెంటీ ఏంటి అని ప్రియ అడుగుతుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ప్రియ చెప్పు అని మినిస్టర్  అన్నాడు. నాకు నువ్వు కొత్తగా కట్టిస్తున్న ఫామ్ హౌస్ కావాలి అని అడిగాను అది రాఘవ చూసుకుంటున్నాడు కదా ఇంకేదైనా చూద్దాంలే అని మినిస్టర్ అన్నారు. కట్ చేస్తే,

నేను ప్రెగ్నెన్సీ  అని చెప్పు లేదంటే అతను మనల్ని మోసం చేస్తాడు అని నా బాయ్ ఫ్రెండ్ చెప్పడంతో మినిస్టర్ గారికి నేను ప్రెగ్నెన్సీ అని చెప్పి ఆ ఫామ్ హౌస్ నాకు ఇవ్వమన్నాను కుదరదు అన్నాడు దానితో నా బాయ్ ఫ్రెండ్ అతని మీద తిరగబడ్డాడు అని ప్రియ చెబుతుంది..

Related posts

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri