NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri February 26 2024 Episode 163: కేదార్ కి అన్నం తినిపించిన కౌశికి, పుట్టింటికి వెళ్ళిపోతున్న నిషిక..

Jagadhatri Today Episode February 26 2024 Episode 163 Highlights

Jagadhatri February 26 2024 Episode 163: నాకు నిజం తెలియకూడదని మీరు అనుకుంటున్నారు అత్తయ్య కానీ అదేంటో నేనే కనిపెడతాను అని నిషిక అనుకుంటుంది. కట్ చేస్తే,ఏం ఆలోచిస్తున్నావ్ కేదార్ అని జగదాత్రి అంటుంది. నాన్న జైల్లో ఉన్నాడని తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది అని కేదార్ బాధపడతాడు. నీ బాధ నీ మనసుకు అర్థమవుతుంది కానీ కడుపుకు అర్థం కాదు కదా రా కూర్చో వచ్చి భోజనం చేయి అని కేదారికి అన్న ఓడిస్తుంది జగదాత్రి.. యువరాజ్ నిషిక  సంతోషంగా అన్నం తినడం చూసి కౌశికి బాధపడుతుంది.

Jagadhatri Today Episode February 26 2024 Episode 163 Highlights
Jagadhatri Today Episode February 26 2024 Episode 163 Highlights

కేదార్ అన్నం మించి లేచిపోతూ ఉండగా కౌశికి చేయి పట్టుకొని ఆపుతుంది. మనకున్న కోపాన్ని బాధని అన్నం మీద చూపించకూడదని మా బాబాయ్ చెప్తూ ఉండేవాడు అన్నం తిని మంచిగా ఉంటేనే కదా కష్టాన్ని ఎదుర్కోగలం అని కౌశికి కేదార్ కి అన్నం తినిపిస్తుంది. ఆ ప్రేమకి కేదార్ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు.సంబంధం లేకపోయినా సొంత తమ్ముడు లాగా ప్రేమ చూపిస్తున్నారు కదా వదిన అని నిషిక అంటుంది. బదలో ఉన్నవారిని ఓదార్చడానికి రక్తసంబంధమే అవసరం లేదు అని కౌశికి అన్నం తినిపిస్తూ ఉంటుంది. రోజు రోజుకి అక్కకు దగ్గర అయిపోతున్నాడు ఏదో ఒకటి చేయాలి అని యువరాజ్ అనుకుంటాడు. ఇంతలో వైజయంతి వచ్చి ఇదేంటి నేను చూస్తున్నది నిజమేనా కౌశికి కూడా నిజం తెలిసిపోయిందా వాడిని తమ్ముడు అనుకుంటుందా అని వైజయంతి అనుకుంటుంది.

Jagadhatri Today Episode February 26 2024 Episode 163 Highlights
Jagadhatri Today Episode February 26 2024 Episode 163 Highlights

కౌశికి మీ బాబాయ్ జైలుకు వెళ్ళినప్పుడు కానుంచి నువ్వు మీ బాబాయ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నావు కానీ అవన్నీ గాల్లో దీపాలు పెట్టింనటు గా ఉన్నాయి అందుకనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని వైజయంతి అంటుంది. ఏంటి పిన్ని అది అని కౌశికి అడుగుతుంది. ఇవాల్టి నుంచి మీ బాబాయి స్థానంలో యువరాజు తమ్ముని కూర్చోబెడదాం అని వైజయంతి అంటుంది. నువ్వు ఆయన ఎప్పటినుంచో యువరాజుని బిజినెస్ చూసుకోమంటున్నారు కదా అందుకే నువ్వు కంపెనీ సీఈఓ గా సంతకం పెడితే వాడు మీ నాన్న పోస్టులో కూర్చుంటాడు అని వైజయంతి అంటుంది. యువరాజ్ ఇంకా బిజినెస్ చూసుకునే అంత తెలివి రాలేదు పిన్ని ఇంకా ట్రైనింగ్ కూడా పూర్తి చేయలేదు అని కౌశికి అంటుంది. వాడు నేర్చుకుంటాలే సంతకం పెట్టి అని వైజయంతి అంటుంది. సైన్ పెట్టండి వదిన అని నిషిక అంటుంది. నన్ను నమ్మక్క అంతా నేను చూసుకుంటాను నాన్న స్థానంలో నన్ను కూర్చోబెట్టి  అని యువరాజ్ అంటాడు.ఒక్క సంతకం పెడితే ఆస్తంతా నా కొడుకు పేరు మీద వచ్చేస్తాది ఆ తర్వాత ఎవడు ఆయన కూడుకొని రాలేరు అని వైజయంతి అనుకుంటుంది. పిన్ని ఈ ఆస్తి వారసత్వం అనేది ఏమీ లేదు నాన్న బాబాయి ఈ కంపెనీని స్థాపిస్తే నేను వాళ్ళ అడుగుజాడల్లో నడిస్తే ఈ స్థాయికి వచ్చింది అంతేకానీ వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు అని కౌశికి అంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం బాబాయ్ ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తీసుకోవడం నాకు నచ్చట్లేదు అని కౌశికి అంటుంది. బాబాయ్ వచ్చాక కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయిద్దాం అని కౌశికి అంటుంది. మామయ్య సీట్లో కూర్చోడానికి మా ఆయనకు అర్హత లేదంటావా వదిన అని నిషిక అంటుంది.బాబాయ్ లేకుండా నేనే ఏ నిర్ణయం తీసుకోలేను అని కౌశికి అంటుంది.

Jagadhatri Today Episode February 26 2024 Episode 163 Highlights
Jagadhatri Today Episode February 26 2024 Episode 163 Highlights

నటించకు వదిన మా ఆయన ఆ సీట్లో కూర్చోవడం నీకు ఇష్టం లేదు కదూ అని నిషిక అంటుంది. నాకు అలా ఏమీ లేదు నిషిక అని కౌశికి అంటుంది. అయితే నీ ప్రాబ్లం ఏంటి అక్క నేను ఆ సీట్లు ఎందుకు కూర్చోకూడదు అని యువరాజ్ అంటాడు. ఎందుకు వదినని అలా మాట్లాడతావు నిషిక అని జగదాత్రి అంటుంది. చూసావా వదిన నీ వల్లనే అది కూడా నాకు చెప్పగలుగుతుంది అని నిషిక అంటుంది. తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటున్నావు నిషిక అని జగదాత్రి అంటుంది. ఇది నా ఇల్లు నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను నువ్వు ఎవరే అనడానికి అని నిషిక అంటుంది. ఎవరు ఏ పొజిషన్లో కూర్చోవాలి అనేది నేనొక్కదాన్ని తీసుకునే నిర్ణయం కాదు యువరాజని ఎప్పుడు ఎక్కడ ఎలా కూర్చోబెట్టాలో నాకు బాబాయ్ కి తెలుసు దయచేసి ఇంట్లో వాళ్ళు బిజినెస్ గురించి కలగజేసుకోకుంటే మంచిది అని కౌశికి కౌశికి అంటుంది. ప్రతిసారి ఇలా ఏదో ఒకటి చెప్పి మా నోరు మూయిస్తున్నారు అంటూ నిషిక యువరాజ్ కోపంగా వెళ్ళిపోతారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 26 2024 Episode 163 Highlights
Jagadhatri Today Episode February 26 2024 Episode 163 Highlights

కష్టమొచ్చినప్పుడే ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు అనేది తెలుస్తుంది ఇంత బాధలో ఉన్నా కూడా నిషిక చూడు ఎలా మాట్లాడుతుందో అర్థం చేసుకోకుండా అని కౌశికి అంటుంది. ఏం చేసినా ఇంటి కుటుంబం పరువు కోసమే చేస్తారని తెలుసులే వదిన తన కోపం నీటి బుడగ లాంటిది ఈ గొడవ జరిగిందన్న విషయమే మర్చిపోతుంది అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 26 2024 Episode 163 Highlights
Jagadhatri Today Episode February 26 2024 Episode 163 Highlights

నిషిక బ్యాగు చదువుకుంటుంది. ఏదైనా చేయాలి అంటే ఆరవాలి కానీ బ్యాక్ సదురుకోవడమేంటి అని వైజయంతి అంటుంది. ఇంట్లో ఉండాలంటే అని గిమనిగి ఉండాలి చెల్లి అని బూచి అంటాడు. నాకలాంటి అవసరం లేదు అని నిషిక అంటుంది. అందుకని బ్యాగ్ సర్దుకుని మీ ఇంటికి వెళ్ళిపోతావా నిషిక అని యువరాజ్ అంటాడు. మీ నాన్న సీట్లో నిన్ను కూర్చోబెట్టడానికి ఆవిడకి ఏంటండీ ప్రాబ్లం మీరు ఆయన కొడుకు కాదా నీకు అధికారం లేదా లేదంటే మీ నాన్నగారికి ఇద్దరు కొడుకులు ఉన్నారా ఆయన వచ్చి నిర్ణయించడానికి  ఉన్నది మీరు ఒక్కరే కదా అని నిషిక అంటుంది. ఎందుకు ని మనకు వివరంగా చెప్పింది కదా అని వైజయంతి అంటుంది. అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు అత్తయ్య అసలు కాదనడానికి ఆమె ఎవరో అత్తయ్య సంతకం పెట్టండి అంటే ఎందుకు పెట్టరు అని మీరు అనలేరు కదా ఎందుకంటే మీక్కూడా ఆవిడ అంటే భయం తన మాటకు ఎదురు చెప్తే ఎక్కడ రోడ్డు మీద పడేస్తుందోనని మీకు భయం నాకు మాత్రం బానిసలా బ్రతకడం ఇష్టం లేదు అని నిషిక అంటుంది. బాబాయ్ వచ్చిన తర్వాత నిన్ను ఎండిని చేయమంటే చేస్తాడు కదా ఆ మాత్రానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా అని కాచి అంటుంది. ఇంట్లో ఆవిడదే పై చేయి అవ్వాలి అంటే సింహాసనంలో ఆవిడ మాత్రమే ఉండాలి కౌశికి వదిన పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ఇంట్లో మాత్రం అందరూ ఆవిడ బానిసలే నాకు ఆ కర్మ పట్టలేదు అందుకే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను మీరు అన్నట్టు మామయ్య గారు ఆయనని మేనేజర్ ని చేస్తే వజ్ర పాటీ ఇంటి కోడలుగా తలెత్తుకొని తిరిగి వస్తాను అని నిషిక అంటుంది..

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N