అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు కియరా అద్వాని సుపరిచితురాలే. ఈ అమ్ముడు ప్రస్తుతం కాంచన హిందీ రీమేక్ లక్ష్మీబాంబ్లో హీరోయిన్గా నటిస్తోంది. కియరా తల్లేమో ట్రెడిషన్‌ను ఫాలో అవుతుండాలని చెబుతుంటుందట. కజన్ పెళ్లి కోసం చీర కట్టుకోమని తల్లి చెబితే రెడీమేడ్ చీర కట్టుకున్నానని కియరా అంది. అలాగే పొడవాటి జుట్టుకూ మెరుగులు దిద్దుతూ నూనె పెట్టుకోవడం ఎక్కడ కుదురుతుందో చెప్పండి అంటూ కియరా చిరాకు పడింది. అంతటితో ఊరుకోకుండా తన జుట్టుని కత్తెరతో కట్ చేసేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. తెలుగులో భరత్ అనేనేను, వినయవిధేయరామ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది కియరా అద్వాని.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!