Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస పరాజయాలలో ఉన్న సమంత గత ఏడాది “ఖుషి” సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కటం జరిగింది. గత రెండు సంవత్సరాలు వ్యక్తిగత జీవితంలో ప్రొఫెషనల్ గా సమంత అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ ఇంకా కన్ఫామ్ చేయలేదు. ప్రస్తుతం తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా పలు ఆడియోలతో తెలియజేస్తుంది. అనారోగ్యానికి గురైన సమయంలో ఏ విధంగా వాటిని జయించడం జరిగింది ఇంకా అనేక విషయాల గురించి తన ఫాలోవర్స్ అభిమానులతో పంచుకుంటూ ఉంది. సమంత తాజాగా సోషల్ మీడియాలో తనకిష్టమైన నటులు ఎవరో.. మొత్తం లిస్టు తెలియజేసింది.
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనకి ఎంతో ఇష్టమైన నటుడు అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆయన ఫోటో పోస్ట్ చేసి నాకు అభిమాన ఇష్టమైన నటుడు అనే క్యాప్షన్ తో పాటు స్టార్ ఎమోజిని జోడించింది. మరో పోస్టులో ఫహద్ ఫాజిల్ బిల్ బోర్డ్ ఫోటోని షేర్ చేసి నాకు ఇష్టమైన మరో నటుడు అని కామెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం సమంత హిందీలో వరుణ్ ధావన్ తో “సిటేడేల్” అనే వెబ్ సిరీస్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. 2022లో మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడిన సమంత.. దానికోసం ఆరోగ్యపరంగా అనేక చికిత్సలు చేయించుకోవడం జరిగింది.
ఈ క్రమంలో షూటింగులకు కనీసం నాలుగు నెలలకు పైగా హాజరు కాలేదు. పూర్తిగా మంచానికి పరిమితమైన సమంత అనంతరం.. కోలుకొని మళ్లీ సినిమాలు చేయటం జరిగింది. ఒప్పుకున్న సినిమాలు మొత్తం కంప్లీట్ చేసి గత ఏడాది ఖుషి సినిమాతో విజయం సాధించింది. ఆ తర్వాత విదేశాలలో మిగతా బ్యాలెన్స్ ట్రీట్మెంట్ చేయించుకుని ఇప్పుడు మళ్లీ ప్రాజెక్టులు ఒప్పుకుంటుంది. ఒకపక్క సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మరోపక్క హిందీలో కూడా సినిమాలు చేయటానికి సామ్ రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!