Ram Charan: మెగా స్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఎంతటి పాపులారిటీ దక్కించుకున్నాడో మనందరికీ తెలిసిందే. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న చెర్రీ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాపై చెర్రీ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉంటే చరణ్ కి ఇటీవలేవో ఆడబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి మెగా ఫ్యామిలీలో మొత్తం సంతోషాలు వెదజల్లుతున్నాయి. ఇక ఈమధ్య ఆమె కేర్ టేకర్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం తన కుక్కపిల్ల గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చరణ్ తన కుక్క పిల్లను ఎంత బాగా కేర్ చేస్తాడో మనందరం అనేక చోట్ల చూశాము. రామ్ చరణ్ కుక్క పేరు రైన్. దీనికి కూడా ఒక సోషల్ మీడియా ఎకౌంట్ ఉంది. ఈ కుక్క చరంతో అవుట్ ఆఫ్ ది షూట్ అండ్ షూటింగ్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికెళ్లిన అది చెర్రీ వెనకే ఉంటుంది. చివరికి త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్‌లో కూడా చెర్రీ ఆ కుక్కను తీసుకెళ్లారు.
ఇక ” alwaysrhyme ” అనే పేరుతో ఆ కుక్కకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఇక ఆ కుక్కకి 77 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంత ఫాలోయింగ్ కొందరి సెలబ్రిటీస్ కి కూడా ఉండదనే చెప్పొచ్చు. ఇక చరణ్ దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడట. చరణ్ తినే ఆహారం మరియు చేసే ప్రతి పనిలో అది ఉంటుందట. ఏదేమైనా చెర్రీ ఆ డాగ్ ని అంత ప్రేమగా చూసుకోవడం గ్రేట్ అని చెప్పొచ్చు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!