Nabha Natesh: నభా నటేష్.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `వజ్రకాయ` అనే కన్నడ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. `నన్ను దోచుకుందువటే`తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో.. నభా తనదైన క్యూట్‌నెస్‌తో యూత్‌ను ఫిదా చేసింది.
ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిన `ఇస్మార్ట్ శంకర్`లో మాస్ హీరోయిన్గా నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. 2019లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆపై నభా నటేస్ రవితేజతో `డిస్కో రాజా`, సాయి ధరమ్ తేజ్ సరసన `సోలో బ్రతుకే సో బెటర్` చిత్రాలు చేసింది.
ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. నటన పరంగా నభా నటేష్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక గత ఏడాది `మాస్ట్రో`తో ప్రేక్షకులను పలకరించిన నభా.. ప్రస్తుతం ఆఫర్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తరచూ అదిరిపోయే ఫొటో షూట్లతో కుర్రాళ్ళ గుండెల్లో గిలిగింతలు పెడుతోంది.
తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషినల్ దుస్తుల్లో మెరిసింది. రెడ్ కలర్ లెహంగా ఓణీ ధరించిన నభా.. పైట లేకుండా టాప్ యాంగిల్ నుంచే కాకుండా లో యాంగిల్ నుంచి సైతం హాట్ హాట్‌గా ఫొటోలకు పోజులిచ్చంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
వీటిని చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అంత అందంగా నభా నటేష్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తాజా పిక్స్‌పై అభిమానులు, నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.