Pawan Trivikram: టాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ విజయాలు ఎక్కువ సాధించిన హీరో పవన్ కళ్యాణ్. పొలిటికల్ రంగంలో అడుగుపెట్టిన తర్వాత రీఎంట్రీ ఇచ్చి పవర్ నటించిన రెండు సినిమాలు “వకీల్ సాబ్”, “బీమ్లా నాయక్” రెండూ కూడా రీమేక్ సినిమాలు అన్న సంగతి తెలిసిందే. పైగా రెండు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఒకపక్క పార్టీని నడిపిస్తూనే ఉంటున్న తరుణంలో రీమేక్ సినిమాలకు సంబంధించి కథలు మరియు మార్పులు చేర్పులు విషయంలో తన బాధ్యత మొత్తం డైరెక్టర్ త్రివిక్రమ్ కి అప్పచెప్పడం జరిగిందట. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో “బీమ్లా నాయక్” విజయం సాధించటంలో కూడా త్రివిక్రమ్ ప్రధాన పాత్ర పోషించారు అన్న సంగతి.. తెలిసిందే.
ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ .. రీమేక్ సినిమాలకు చాలా వరకు డైలాగులు మరియు స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ యే… రాబోయే రోజుల్లో చూసుకున్నబోతున్నట్లు… ఇందుకోసం ఏకంగా 70 కోట్ల రెమ్యునరేషన్ తన రీమేక్ పూర్తి సినిమాలకు సంబంధించి బాధ్యతలను అప్పజెప్పి.. త్రివిక్రమ్ కి పవన్ అందించనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. నెక్స్ట్ పవన్ చేయబోయే రీమేక్ సినిమా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో .. కావటంతో దానికి కూడా త్రివిక్రం డైలాగులు.. మరియు స్క్రిప్ట్ విషయంలో శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం.
ఇకనుండి పవన్ చేయబోయే రీమిక్ సినిమాలకు సంబంధించి పూర్తి బాధ్యతను త్రివిక్రమ్ యే చూడనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇది కాకుండా త్రివిక్రమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కంటే ముందే పవన్ కళ్యాణ్ తో ఒక రాజకీయ నేపథ్యం కలిగిన సినిమా చేయటానికి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. అందులో రెండు భారీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈనేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక స్ట్రైట్ సినిమా పవన్ చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సినిమా ఓకే అయితే బాగుంటుందని డిస్కషన్స్ చేసుకుంటున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!