Poorna: టాలెంటెడ్ నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయినా.. ఇప్పుడిప్పుడే నటిగా నిలదొక్కుకుంటూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో ఈ బ్యూటీ రవిబాబు దర్శకత్వంలోనే వరసగా మూడు(అవును, అవును 2, లడ్డుబాబు) చిత్రాలు చేసింది.
దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ అప్పట్లో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. పూర్ణపై ఉన్న ఇష్టంతోనే రవిబాబు ఆమెకు అన్ని అవకాశాలు ఇస్తున్నాడంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఖండించకపోయినప్పటికీ.. పూర్ణ అప్పటి నుంచీ ఆయన దర్శకత్వంలో మరో సినిమా చేయలేదు. అయితే చాలా కాలం తర్వాత పూర్ణ డేరింగ్ స్టెప్ వేసింది.
విషయం ఏంటంటే.. రవిబాబుతో మళ్లీ ఆమె సినిమా మొదలు పెట్టింది.`అసలు` టైటిల్‌తో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమాకు రవిబాబు దర్శకత్వం వహించడమే కాదు.. ఇందులో ఓ ప్రధాన పాత్రను సైతం పోషిస్తున్నారు. ఈ విషయాన్ని పూర్ణ ఇన్స్టాగ్రామ్ ద్వారా పేర్కొంది.
`అవును తర్వాత మేము మరో అద్భుతమైన ప్రాజెక్ట్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాం. గతంలో పనిచేసిన టీంతోనే తిరిగి వస్తుండటం ఆనందంగా ఉంది. మరోసారి నాపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించినందుకు రవిబాబు సార్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను` అంటూ తన పోస్ట్‌లో పూర్ణ రాసుకొచ్చింది. దీంతో ఆమె పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
https://www.instagram.com/p/CaZ33BOBfpn/?utm_source=ig_web_copy_link
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!