Prabhas- Maruthi: ఇటీవల ప్రభాస్-మారుతి కాంబో అంటూ వార్తలు రావడం మనం చూసాం. అంతేకాకుండా మన డార్లింగ్ అభిమానులు ఈ కాంబినేషన్ విషయంలో కాస్త అసహనానికి గురవ్వడం కూడా తెలిసినదే. అయితే ఈ కాంబినేషన్ త్వరలో షురూ కాబోతోందంటూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ప్రభాస్ – మారుతి దర్శకత్వంలో సినిమా ఉంటుందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడుతుందని తెలుస్తోంది.
Prabhas: రాధేశ్యామ్‌కు నెగిటివ్ టాక్ ఉన్నా.. ప్రభాస్ డిమాండ్ మామూలుగా లేదే…!
Prabhas- Maruthi: వార్త నిజమే అనిపిస్తోంది?
ఈ కథ ప్రభాస్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా అన్ని కమర్షియల్ హంగులతో డైరెక్టర్ మారుతి పక్కా మాస్ మసాలా ఎంటర్టైనింగ్ గా రూపొందించాడని తెలుస్తోంది. ఆ విషయం నచ్చే డార్లింగ్ ఈ సినిమాకి ఓకే చెప్పినట్లు టాక్. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ప్రభాస్‌తో జత కట్టబోతున్నారని వారిలో ఇప్పటికే రాశీ ఖన్నా, మాళవికా మోహనన్ ఫైనలైజ్ అయినట్లు కూడా వార్తలు బయటకు పొక్కుతున్నాయి. ఇప్పటికే వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా వున్న ప్రభాస్ ఈ సినిమా ఎప్పుడు చేయబోతాడో మరి!
<img src=”https://newsorbit.com/wp-content/uploads/2022/03/IMG-20220314-WA0181.jpg” alt=”” width=”700″ height=”400″ class=”alignnone size-full wp-image-238916″ /
Prabhas: సలార్ సినిమాతో అన్నీ తీర్చేస్తాడు..
భారీ సెట్స్ సంగతి?
ప్రభాస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని నెటివిటీకి తగ్గట్టు కథను సిద్దం చేసిన మారుతి, చాలా తక్కువ డేట్స్నే ప్రభాస్ నుంచి తీసుకున్నాడని వినికిడి. వీలైనంత త్వరగా ప్రభాస్ సినిమాను పూర్తి చేయాలనేది మారుతి ప్లాన్ అట. ఇక ఈ సినిమా షూటింగ్‌ను కూడా ఎక్కువ భాగం స్టూడియో, సెట్స్‌లోనే పూర్తి చేసేలా ప్రణాళికలు కూడా జరిగిపోయాయట. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకోసం ఓ సెట్‌ను మారుతి సిద్ధం చేయిస్తున్నారట.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!