NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Prema Entha Madhuram February 14 2024 Episode 1178: ఆర్య సూర్య కాదని నిజం బయటపెట్టాలి అంటున్న జలంధర్.

Prema Entha Madhuram Today Episode February 14 2024 Episode 1178 Highlights

Prema Entha Madhuram February 14 2024 Episode 1178:  అమ్మ జాగ్రత్త అని ఆర్య అంటాడు. నాకేం కాదులే ఆర్య అని వాళ్ళ అమ్మ అంటుంది. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. మా బావ పేరు సూర్య అండి అందరూ ఆర్య అంటున్నారు ఏంటి అని యాదగిరి కవర్ చేస్తాడు. అవును కదా తను సూర్య కదా అని వాళ్ళ అమ్మ అంటుంది. మీరేమీ అనుకోవద్దండి మా సూర్య ఎవరినైనా అమ్మలాగే చూస్తాడు అని సుగుణ అంటుంది. పర్వాలేదండి అమ్మ ఎవరికైనా అమ్మే కదా అని వాళ్ళ అమ్మ అంటుంది. మీరేమీ అనుకోనంటే వీళ్లను ఒక రోజు మా ఇంటికి భోజనానికి తీసుకువెళ్తాను అని ఆర్య వాళ్ళ అమ్మ అంటుంది. దాందేముందండి తప్పకుండా తీసుకెళ్లండి అని సుగుణ అంటుంది.సరేనండి వెళ్లి వస్తాను అని ఆర్య వాళ్ళ అమ్మ అంటుంది. ఈవిడ ఆర్య వర్ధన్ వాళ్ళ అమ్మ అని ఉష అనుకుంటుంది. నాయనమ్మ ఇంకొక కొద్దిసేపు ఉండొచ్చు కదా అని పిల్లలు అంటారు. ఇంకెప్పుడైనా వస్తాను లే నాన్న ఇప్పుడే కదా మిమ్మల్ని కలిసాను అని ఆవిడ అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 14 2024 Episode 1178 Highlights
Prema Entha Madhuram Today Episode February 14 2024 Episode 1178 Highlights

అలాంటప్పుడు మీ వెంటనే తీసుకు వెళ్లొచ్చు కదా అని దివ్య అంటుంది.దివ్య ఏం మాట్లాడుతున్నావే అని సుగుణ అంటుంది. కోడలు మీద అంత ప్రేమ ఉన్నప్పుడు తీసుకువెళ్లొచ్చు కదా అమ్మ ఇక్కడ ఎందుకు ఉంచడం తన కొడుకు పిల్లలే కదా అని దివ్య అంటుంది. చూడమ్మానాకు కూర్చుని తిన్న తరగని ఆస్తి ఉంది నా కోడలు నా మనవడు మనవరాళ్లు నాకేమీ బరువు కాదు నేను తీసుకు వెళ్తాను అన్నా నా కోడలు రాదు నా కోడలికి ఆస్తి కన్నా కుటుంబామే ఎక్కువ తను బంధానికి విలువిస్తుంది చూడు దివ్య నీలో బాధ కనపడుతుంది ఒకరి సంతోషాన్ని చూసి ఎప్పుడూ ఈర్ష్య పడకూడదు అమ్మ  ఈర్ష్య పడితే బాధే మిగులుతుంది అని ఆర్య వాళ్ళమ్మ అంటుంది. దివ్య మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంది. మా దివ్య మాటలు ఏమీ పట్టించుకోకండి తన పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది అని బాధపడుతుంది అని సుగుణ అంటుంది. ఆడపిల్ల పెళ్లి పీటలు దాకా వచ్చి ఆగిపోతే ఎంత బాధ ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అని ఆర్య వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Prema Entha Madhuram Today Episode February 14 2024 Episode 1178 Highlights
Prema Entha Madhuram Today Episode February 14 2024 Episode 1178 Highlights

పిల్లలు స్కూల్కు టైం అవుతుంది వెళ్లి రెడీ కండి అని ఆర్య అంటాడు. స్కూల్ కి బంకు కొట్టాలా అని చూస్తున్నాం నాన్న అని పిల్లలు అంటారు. అదేమీ కుదరదు వెళ్లి రెడీ అవ్వండి నేను తీసుకెళ్లి డ్రాప్ చేస్తాను అని ఆర్య అంటాడు. కట్ చేస్తే, పిల్లల్ని స్కూల్ దగ్గరికి తీసుకువెళ్లి దించుతాడు ఆర్య. ఇదేంటి సార్ మీరు తీసుకువచ్చారు వాళ్ళ అమ్మ కదా తీసుకురావాల్సింది అని స్కూల్లో టీచర్ అంటుంది. అప్పుడు అంటే మా నాన్న లేడు కాబట్టి మా అమ్మ తీసుకొచ్చింది ఇప్పుడు మా నాన్న వచ్చాడు కదా అని పిల్లలు అంటారు. మీ అమ్మ పెళ్లి చేసుకుంది సూర్యని కదా మరి ఆర్య వర్ధన్ ఎందుకు తీసుకువచ్చాడు అని టీచర్ అంటుంది. సూర్య అని ఆర్య కదా అని పిల్లలు అంటారు. నన్ను తికమక పెడుతున్నారు అంటూ టీచర్ వెళ్ళిపోతుంది. పిల్లలు టీచర్ని అలా ఇరకాటంలో పెట్టొచ్చా అని ఆర్య అంటాడు. నాన్న మీ పెళ్లి అయింది కదా అని పిల్లలు అంటారు.

Prema Entha Madhuram Today Episode February 14 2024 Episode 1178 Highlights
Prema Entha Madhuram Today Episode February 14 2024 Episode 1178 Highlights

ఇప్పుడే ఏంట్రా మీరు పుట్టక ముందే మా పెళ్లయింది అని ఆర్య అంటాడు. అప్పుడు మేము లేము కదా నాన్న ఇప్పుడు పెళ్లి అయింది కదా మా ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారు వాళ్లకు చాక్లెట్లు కొనివ్వాలి అని డబ్బులు అడుగుతారు పిల్లలు. సరే అని ఆర్య పిల్లలు ఇద్దరికీ చెరొక 100 ఇస్తాడు. నాన్న సూర్య లాగా కాకుండా ఆర్య వర్ధన్ లాగా ఇవ్వండి మీరు చదువుకునే రోజుల్లో ఈ వంద రూపాయలకి ఎన్నో చాక్లెట్ వచ్చేవి ఇప్పుడు అలా కాదు కదా అని అక్కి అంటుంది. అయితే మీ అమ్మని అడగాల్సిందే అని ఆర్య అంటాడు. అమ్మో వద్దులే అని ఆ 100 తీసుకొని పిల్లలు వెళ్ళిపోతారు. ఆర్య బైక్ వేసుకొని వెళ్తూ ఉండగా ఒక పాప నాన్న అని ఆర్య కి ఎదురుగా పరిగెత్తుకొస్తుంది. ఆ పాపని చూసి పక్కకు బండి తీసేసరికి ఆర్య కింద పడిపోతాడు ఆ పాప వెళ్లి ఒక బండ మీద పడుతుంది ఆర్య వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్తాడు.

Prema Entha Madhuram Today Episode February 14 2024 Episode 1178 Highlights
Prema Entha Madhuram Today Episode February 14 2024 Episode 1178 Highlights

కట్ చేస్తే, దివ్య ఛాయా వాళ్ళ ఇంటికి వస్తుంది. దివ్య ఇక్కడికొస్తుందేంటి ఏం జరుగుతుంది అని అను దివ్య వెనకాల ఫాలో అయి ఛాయ వాళ్ళ ఇంటికి వెళుతుంది. చూడు దివ్య మీ అమ్మ పెట్టిన సంతకం ఆ పేపర్లు ఇవే ఇంకేమీ ఆలోచించకుండా వాటి మీద సంతకం పెట్టు నీకు రావాల్సిన వాటా నీకు ఇప్పిస్తాం అని ఛాయా జలంధర్ అంటారు. దివ్య ఏమి ఆలోచించకుండా సంతకం పెట్టబోతు ఉండగా అను వచ్చి దివ్య ఆగు అని అంటుంది. ఏం చేస్తున్నావ్ దివ్య ఏమైనా అర్థమవుతుందా రా ఇంటికి వెళ్దాం అని అను అంటుంది. నువ్వు ఎవరి నన్ను రమ్మనడానికి అని దివ్య అంటుంది నేను మీ అన్నయ్యకు భార్యను  నీ వదినను అది చాలదా నిన్ను రమ్మనడానికి అని అను అంటుంది. నాకు అన్నీ తెలిసే సంతకం పెడుతున్నాను నువ్వేం నాకు చెప్పక్కర్లేదు అని దివ్య అంటుంది. మీ అన్నయ్య నీ కోసం ఎంతగానో ఆలోచిస్తుంటే నువ్వు ఈ పిచ్చి పని ఎందుకు చేస్తున్నావు దివ్య మీ అన్నయ్య రాకముందు నువ్వు కుటుంబానికి ఆడగా ఉన్నావని ఆ ల్యాండ్ లో 50% నీకే చెందేలా మీ అన్నయ్య రాసి పేపర్లు రెడీ చేశారు నువ్వు ఇంటికి వస్తే ఆ వాటర్ పేపర్లు నీ చేతిలో ఉంటాయి ఇంకేమి ఆలోచించకు నా వెంట రా అని అను అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 14 2024 Episode 1178 Highlights
Prema Entha Madhuram Today Episode February 14 2024 Episode 1178 Highlights

నీ మాటలు నమ్మడానికి దివ్యమన్న చిన్నపిల్లలనుకుంటున్నావా ఇలాంటి మాయమాటలు చెప్పి తన ఆస్తి ఎక్కడ కొట్టేస్తావో నాని తనకు భయం అని ఛాయా అంటుంది. చూడు దివ్య నువ్వు ఏం ఆలోచించినా ముందు ఇంటికి వచ్చి అది నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలో ఆలోచించు అని అను ల్యాండ్ పేపర్లని చింపేసి వెళ్లిపోతుంది. దివ్య ఆలోచనలో పడుతుంది. దివ్య ఇప్పుడు గొడవ అంతా ఎందుకు వెళ్లి ఆ పేపర్ లేంటో చూడు నీకు సహాయంగా మేము వస్తాం అని జలంధర్ అంటారు. సరే నేను ముందు వెళ్తాను మీరు పది నిమిషాల తర్వాత రండి అని దివ్య వెళ్ళిపోతుంది. ఏంటి అన్నయ్య చేతులు దాకా వచ్చిందని వదిలేసావు అని ఛాయా అంటుంది. ఆర్య వర్ధన్ సూర్యకాదని తెలిసే టైం వచ్చేసింది చెల్లెమ్మ మనం సూర్య డెడ్ బాడీని తీసుకొని అక్కడికి వెళ్లి నిజం చెప్పేద్దాం అప్పుడు ల్యాండ్ దక్కుతుంది ఆర్య మీద పగా తీరుతుంది ఒక్క దెబ్బకి రెండు పిట్టలు రాలుతాయి అని జలంధర్ అంటాడు. కట్ చేస్తే, ఆర్య ఆ పాపని పాప నీకేమైంది ఒకసారి కళ్ళు తెరువు అని అంటాడు. పాప కళ్ళు తెరుస్తుంది. మీ అమ్మానాన్నలు ఎవరు నీ పేరేంటి అని ఆర్య అంటాడు. ఆ పాప ఆర్యవంక వేలు చూపండి మళ్లీ స్పృహ కోల్పోతుంది. డాక్టర్ పాప చూడండి మళ్లీ స్పృహ తప్పిపోయింది అని ఆర్య అంటాడు. ఏదైనా షాక్ లాంటివి విన్నప్పుడు ఇలా స్పృహ కోల్పోతూ ఉంటారు సార్ తనకేమీ కాలేదు అని డాక్టర్ టెస్ట్ చేసి చెబుతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri