NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Prema Entha Madhuram February 20 2024 Episode 1183: పాపని ఇంటికి తీసుకొచ్చిన ఆర్య, ఆర్యని నాన్న అని పిలిచినా పాప..

Prema Entha Madhuram Today Episode February 20 2024 Episode 1183 Highlights

Prema Entha Madhuram  February 20 2024 Episode 1183: వేరే చోటికి ఎందుకు పంపిస్తారు మీ అమ్మ నాన్న దగ్గరికి పంపిస్తారు మీ అమ్మ నాన్న పేరేంటి మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అని ఆర్య అడుగుతాడు. పాప ఏమి మాట్లాడకుండా తలదించుకుంటుంది. నువ్వు అలా తలదించుకుంటే ఎలాగా మీ అమ్మ నాన్న కంగారు పడుతూ ఉంటారు కదా మీ నాన్న పేరు ఏంటో చెప్పు అని ఆర్య అడుగుతాడు. ఆ పాప ఆర్య వంకా వేలు చూపెడుతుంది. నేనా అని ఆర్య అంటాడు. నువ్వే మా నాన్నవి అని పాప అంటుంది. ఏమంటున్నావ్ నేను మీ నాన్నని కాదు నీకు దెబ్బ తగిలితే నిన్ను హాస్పిటల్ జాయిన్ చేశాను అంతే ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకో అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు అని ఆర్య అడుగుతాడు. నేను చెప్పేది నిజం నువ్వే మా నాన్నవి నీకోసం వెతుక్కుంటూ వచ్చాను నువ్వే మా నాన్నవి అని పాప అంటుంది. పాప ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఎవరైనా ఇలా చెప్పిస్తున్నారా అని ఆర్య ఆలోచిస్తాడు. అసలు నువ్వు నాకోసం వెతుక్కుంటూ రావడం ఏంటి ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చావు అని పాపని అడుగుతాడు ఆర్య.

Prema Entha Madhuram Today Episode February 20 2024 Episode 1183 Highlights
Prema Entha Madhuram Today Episode February 20 2024 Episode 1183 Highlights

తన దగ్గర ఫోటో చూసి ఆశ్చర్యపోతాడు. నీ ఫోటో చూపించి అడ్రస్ అడుగుతూ వచ్చాను నాన్న అని పాప అంటుంది. నా ఫోటో ఈ పాప దగ్గర ఉండడం ఏంటి నన్ను నాన్న అనడం ఏంటి ఏం జరుగుతుంది అని ఆర్య పాప ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరైనా నీ చేత ఇలా చేయిస్తున్నారా చెప్పు అని ఆర్య అంటాడు. పాప ఎందుకు ఏడుస్తున్నావ్ అని ఆర్య అంటాడు. నాన్న ఆకలేస్తుంది అని పాప అంటుంది. సరే పద అని ఆర్య అంటాడు. ఆర్య ఏమి మాట్లాడకుండా పాపని తీసుకొని వెళ్తాడు. కట్ చేస్తే. అను హోమం చేస్తూ ఆర్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మ హోమం పూర్తి అయిపోవచ్చింది ఆర్య వస్తే పూర్ణాహుతి చేయించాలి అని పంతులు గారు అంటారు. కేశవ ఆర్యకి ఫోన్ చెయ్ అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇదిగో దాదా వచ్చాడు అని నీరజ్ అంటాడు. ఆర్య పూర్ణాహుతి జరిపించాలి అని వాళ్ళ అమ్మ అంటుంది.పాప రా అని ఆర్య పిలుస్తాడు. పాప వచ్చి అనుని పట్టుకుంటుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. ఆర్య ఎవరు ఈ అమ్మాయి అని వాళ్ళ అమ్మ అడుగుతుంది.

Prema Entha Madhuram Today Episode February 20 2024 Episode 1183 Highlights
Prema Entha Madhuram Today Episode February 20 2024 Episode 1183 Highlights

నిన్న నేను దారిలో వెళ్తుంటే ఈ పాపకి యాక్సిడెంట్ జరిగింది అమ్మ నేనే ఈ పాపని హాస్పిటల్లో జాయిన్ చేశాను అని ఆర్య అంటాడు. వాళ్ళ అమ్మా నాన్న ఎవరూ లేరా అని వాళ్ళ అమ్మ అంటుంది. వాళ్ళ ఇంట్లో అతనికి చెప్పి తనకి జూసి తాగించు ఆకలి వేస్తుంది అని ఆర్య అంటాడు. అతను పాపను తీసుకొని వెళ్ళిపోతాడు. పాపని ఇంటికి తీసుకురావడం ఏంటి ఆర్య వాళ్ళ అమ్మ నాన్న లేరా అని జెండి అంటాడు. ఏమో జెండి ఎవ్వరు లేరేమో తెలియదు అందుకే ఇంటికి తీసుకొచ్చాను అని ఆర్య అంటాడు. ఎవరమ్మ తను ఇకమీదట మనతోటే ఉంటుందా అని పిల్లలు అంటారు.దారి తప్పిపోయింది అంటున్నాడు కదా ఏదో ఒకటి చేసి పంపిస్తాడు లే సార్ వచ్చి కూర్చోండి హోమం పూర్తి చేద్దాం అని అను అంటుంది. హోమం పూర్తయిపోతుంది. పంతులుగారు వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, థాంక్యూ దేవుడా నీవల్లే మా నాన్నని కలుసుకోగలిగాను థాంక్యూ అని అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 20 2024 Episode 1183 Highlights
Prema Entha Madhuram Today Episode February 20 2024 Episode 1183 Highlights

ఇంతలో అను వచ్చి ఏం చేస్తున్నావ్ నీ పేరేంటి అని అడుగుతుంది. ఆనంది అని ఆ పాప చెబుతోంది. మీ అమ్మా నాన్న ఎవరు ఎక్కడ ఉంటారు అని అను అంటుంది. పాప ఏడుస్తుంది. ఎందుకు ఆనంది ఏడుస్తున్నావ్ ఇకమీదట అడగనులే ఆకలేస్తుంది అన్నావ్ కదా అన్నం పెడతాను అని అను అంటుంది. మీరు వెళ్ళండి నేను వస్తాను అని ఆ పాప ఫోటో తీసి టేబుల్ మీద పెట్టి వెళ్తుంది. కట్ చేస్తే, ఆర్య ఆ పాప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అక్కి నువ్వు ఓడిపోయావ్ అని అభయ్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 20 2024 Episode 1183 Highlights
Prema Entha Madhuram Today Episode February 20 2024 Episode 1183 Highlights

నాన్న నేను ఓడిపోయాను అన్నయ్యను నువ్వే ఓడించాలి అని అక్కి అంటుంది. అలాగే అని ఆర్య అభయ్ పోటీపడి ఆర్య అభయ్ ని ఓడిస్తాడు. చిన్నపిల్లల్ని చేసి ఓడించడం కాదు నాతో ఆడు చూడండి అని అను అంటుంది. నిన్ను క్షణంలో ఓడిస్తాను అని ఆర్య అంటాడు. మమ్మీ డాడీ మీరిద్దరూ ఆడండి డాడీ నువ్వు తగ్గేది లేదు అమ్మని ఓడించు అని అక్కి అంటుంది. అను గెలుస్తుంది ఆర్య ఓడిపోతాడు. అమ్మే గెలిచింది అని ఆభయ్ చప్పట్లు కొడతాడు. ఏంటి నాన్న అమ్మ ముందు ఓడిపోయావ్ అని అక్కి అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 20 2024 Episode 1183 Highlights
Prema Entha Madhuram Today Episode February 20 2024 Episode 1183 Highlights

ఈసారి ఓడిపోయిన తర్వాత మళ్లీ గెలుస్తాను అని ఆర్య అంటాడు. సార్ రండి వెళ్లి భోజనం చేద్దాం అని అను అంటుంది. అను పాపని పిలిచావా అని ఆర్య అంటాడు. పిలిచానండి అని అను అంటుంది. తను ఎందుకు భయపడుతుంది అని అను అంటుంది. తను షాక్ లో ఉంది కదా తర్వాత అడిగి తెలుసుకుందాం అని ఆర్య అంటాడు. కట్ చేస్తే, ఆనంది భోజనం చేయడానికి కిందికి వస్తుంది. ఆభయ్ అక్కి ఆర్య అను కిందికి వస్తూ ఉండడం చూసి బాధపడుతుంది. బాబాయ్ పక్కన కూర్చుంటాము అంటూ పిల్లలు వచ్చి నీరజ్ పక్కన కూర్చుంటారు.

పాప ఇక్కడ నీకు ఏం కావాలన్నా తిను ఏమీ భయపడకు అని ఆర్య అంటాడు. నాయనమ్మ ఈరోజు స్పెషల్ ఏంటి అని పిల్లలు అడుగుతారు. మీకు అన్ని ఇష్టమైనవి వండించాను కడుపునిండా తినండి అని వాళ్ళ నాయనమ్మ అంటుంది. అను అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. ఆనంది తిను ఎందుకు భయపడుతున్నావ్ అని పిల్లలు అంటారు. నాన్న నాకు తినిపిస్తావా అని ఆనంది అంటుంది. ఆ మాట విని అందరూ షాక్ అయిపోతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri