లాస్ ఏంజిల్స్‌లో బ్యూటీ కాన్ అనే ప్రైవేట్ ప్రోగాంకు ప్రియాంక చోప్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రోగ్రాం అనంతరం ఆమె అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ప్రారంభించారు. `యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న నువ్వు సర్జికల్ స్ట్రయిక్స్ సమయంలో `జైహింద్` అంటూ ట్వీట్ ఎలా పెడతావ్ అంటూ ఆమెను ఇబ్బంది పెట్టేలా కేకలు వేశారు. ఆమె మాట్లాడేటంతసేపు ఓపికగా ఉన్న ప్రియాంకచోప్రా తర్వాత మాట్లాడుతూ “యుద్ధం దేనికీ పరిష్కారం కాదు. నేను మీ మాటలు విన్నాను. నేను భారతీయురాలిని. నాకు పాకిస్థాన్‌లోనూ అభిమానులున్నారు. నువ్వు నీ దేశం గురించి ఎలా ప్రశించావో? అలాగే నేను నాదేశం కోసం మాట్లాడుతాను. కానీ నువ్వు అడిగిన విధానం బాగా లేదు. అరిచి మీ విలువను తగ్గించుకోవద్దు. ప్రతి రంగంలోనూ మహిళలు ముందుకు సాగాలని కోరుకునే వ్యక్తిని నేను. అలాగే ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను“ అన్నారు. ప్రియాంక సమాధానం చెప్పిన తీరు చూసిన వారందరూ పాక్ మహిళ గందరగోళపడితే.. ప్రియాంక మాత్రం చాలా హుందాగా సమాధానం ఇచ్చారని అంటున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!