NewsOrbit
న్యూస్ సినిమా

Puri jagannath: మొదటిసారి విజయ్ కోసం బడ్జెట్‌ను లెక్కచేయని పూరి జగన్నాథ్..?

Puri jagannath: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ముందుగా చెప్పాల్సింది ఆయన సినిమాను అందరికంటే త్వరగా కంప్లీట్ చేస్తారు. హీరో ఎవరైనా తన మార్క్ మాసిజం చూపించాల్సిందే. ఎంత క్లాస్ హీరో అయినా పూరి చేతిలో పడితే పక్కా మాస్ హీరోగా మారిపోవాల్సిందే. ఇక మరీ ముఖ్యంగా సినిమా బడ్జెట్ కంట్రోల్ తప్పింది చాలా తక్కువ సందర్భాలలోనే. అనుకున్న బడ్జెట్‌తోనే పూరి సినిమాను కంప్లీట్ చేసి వదులుతారు. బయట నిర్మాతలతో సినిమా తీస్తే మరింత జాగ్రత్తగా పూరి సినిమా చేయడం గొప్ప విషయం. ఇండస్ట్రీలో జీరోకు వెళ్ళి మళ్ళీ స్టార్ మైల్ స్టోన్ అందుకున్న దర్శకుడు పూరి.

puri-jagannath-vijay devarakonda movie with high budget
puri-jagannath-vijay devarakonda movie with high budget

ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ లైగర్ అనే సినిమాను రూపొందిస్తున్నారు. సాలా క్రాస్ బ్రీడ్ అనేది క్యాప్షన్. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. షూటింగ్ పూర్తైన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమా బడ్జెట్ రూ 120 కోట్లని సమాచారం. ఇప్పటి వరకు పూరి తెరకెక్కించిన సినిమాలలో ఇదే హైయ్యెస్ట్ బడ్జెట్. పాన్ ఇండియన్ సినిమాగా లైగర్ నిర్మిస్తున్నారు కాబట్టే ఈ రేంజ్‌లో బడ్జెట్ కేటాయించారు.

Puri jagannath: ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళంలోనూ ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీలకు పరిచయం అవుతోంది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే, పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన కూడా విజయ్ దేవరకొండతోనే తెరకెక్కించనున్నారు. భారీ షెడ్యూల్‌ను ఆస్ట్రేలియాలో మొదలు పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను రూపొందించబోతుండగా దాదాపు లైగర్ బడ్జెట్ కంటే రెండింతలు కేటాయించబోతున్నారట. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri